Familystar: విజయ్‌దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీస్టార్’(Familystar). తనకు వందకోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్ మూవీ ‘గీతగోవిందం’ను 2018లో అందించిన పరశురామ్ పెట్లతో విజయ్‌దేవరకొండ చేస్తున్న రెండో ఫిల్మ్ ఇది. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాల ఫేమ్ మృణాల్ ఠాకూర్ ‘ఫ్యామిలీస్టార్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. లేటెస్ట్గా ‘ఫ్యామిలీస్టార్’ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
విజువల్‌గా, విజయ్ యాక్టింగ్ పరంగా ‘ఫ్యామిలీస్టార్’ టీజర్ బాగున్నా, కథ ప్రకారం మాత్రం చాలామంది గతంలో ఎప్పుడో జగపతిబాబు చేసిన ‘బడ్జెట్ పద్మనాభం’ సినిమా గుర్తొచ్చేలా ఉంది. ఇదే సినిమాను 2024కు, విజయ్ యాటిట్యూడ్‌కు అడాప్ట్ చేసి పరశురామ్ తీశారా? అనే డౌట్‌ను వ్యక్త పరుస్తున్నారు కొందరు నెటిజన్లు. అసలు విషయం తెలియాలంటే ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చెంత వరకు వేచి ఉండాల్సిందే. మరోవైపు ఈ సినిమాతో పాటుగా విజయ్‌దేవరకొండ నెక్ట్స్ చిత్రం కూడా ఫిక్స్ అయ్యింది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. స్పై యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది.