Vijaydevarakonda: టాలీవుడ్లో విజయ్ దేవరకొండ స్టార్ హీరో. యూత్‌లో ‘అర్జున్‌రెడ్డి’ లాంటి రౌడీ స్టార్. ఆడియన్స్‌కు ‘ఫ్యామిలీస్టార్’. కానీ విజయ్ హీరోగా కమిటైన నాలుగు సినిమాలు క్యాన్సిల్ అయ్యాయి. వివిధ కారణాలు, బడ్జెట్ ఇష్యూస్, కాంబినేషన్ సమీకరణాలు…ఇలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలు చిత్రీకరణను పూర్తి చేసుకోలేకపోయాయి.
హీరో
విజయ్‌దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామళ్లై దర్శకత్వంలో 2019లో ‘హీరో’ సినిమా పూజా కార్య క్రమాలతో ప్రారంభమైంది. మాళవిక మోహనన్ హీరోయిన్. మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలు. ‘హీరో’అనేది సినిమా టైటిల్. ఇందులో విజయ్దేవరకొండది బైక్ రేసర్ రోల్. ఈ సినిమా సెట్స్‌పైకి కూడా వెళ్లింది. యాక్షన్ సీకెన్స్తో షూటింగ్ స్టార్ట్ చేశారు. కట్ చేస్తే… ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్‌కే 8 కోట్లరూపాయల బడ్జెట్ అంచనాకు వచ్చిందట. ఆ సమయంలో విజయ్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమానుక్యాన్సిల్ చేశారు. ఇదే సమయంలో ‘హీరో’ టైటిల్ విషయంలోనూ కొంత వివాదం రేగింది. తమిళహీరో శివకార్తీకేయన్ సినిమాకు ‘హీరో’ టైటిల్ ఫిక్సయింది అప్పట్లో. విజయ్, శివకార్తీకేయన్ ‘హీరో’సినిమా టైటిల్ కోసం పోటీ పడ్డారు. అయితే బడ్జెట్ కారణంగా విజయ్ సినిమా ఆగిపోవడంతో శివ కార్తీకేయన్యే ‘హీరో’ టైటిల్ విజేత అయ్యారు. ఈ సినిమా శివకార్తీకేయన్‌కు హిట్ ఇవ్వలేకపోయింది.
హిందీ కామ్రేడ్
‘గీతగోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్నా టాలీవుడ్లో క్రేజీయెస్ట్ జోడీ అయిపోయారు. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన తర్వాతి చిత్రం ‘డియర్ కామ్రేడ్’.భరత్ కమ్మ దర్శకుడు. మైత్రీమూవీమేకర్స్‌తో కలిసి యశ్ రంగినేని ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్‌కు ముందు తెలుగు ‘డియర్ కామ్రేడ్’పై వీపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో రిలీజ్‌కు ముందే విజయ్దేరకొండతో కరణ్‌జోహార్ డీల్ కుదుర్చుకున్నాడు. ‘డియర్ కామ్రేడ్’ హిందీ రైట్స్ తీసుకున్నాడు. కట్ చేస్తే…తెలుగులో ‘డియర్ కామ్రేడ్’కు అంతగా రెస్పాన్స్ రాలేదు రిలీజ్ తర్వాత. దీంతో ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్ ఆగిపోయింది. అలాగే ఈ సినిమాతో విజయ్ హీరోగా హిందీకి పరిచయం అవ్వడం కూడా.
సుకుమార్‌తో సినిమా
కొరటాల శివతో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కాకుంటే..ఇపాటికి విజయ్‌దేవరకొండ, సుకు మార్ కాంబినేషన్లోని సినిమా సెట్స్‌పై ఉండేది. కొరటాలతో అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్ కావడంతో అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ స్టార్ట్ చేశారు సుకుమార్(ఈ సమయంలో విజయ్ ఇతర సినిమాలతో బిజీ). ‘పుష్ప’ తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ బంపర్హిట్తో సుకుమార్ రేంజ్ మారిపోయింది. ఇటు విజయ్‌ని వరుస వైఫ ల్యాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో విజయ్–సుకుమార్ కాంబినేషన్లో సినిమా అనేది ఇప్పట్లో ఆల్మోస్ట్ ఇంపాజిబుల్ అనే చెప్పుకోవాలేమో.
జేజీఎమ్
హీరో విజయ్‌దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా అనగనే హ్యూజ్ హైప్ క్రియేట్ అయ్యింది. వీరు చేసిన తొలి సినిమా ‘లైగర్’. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా విడు దల అయ్యే లోపే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమాను విజయ్‌తో స్టార్ట్ చేశారు పూరీ జగన్నాథ్. ఆగస్టు 3న రిలీజ్‌డేట్ కూడా ప్రకటించారు. కానీ ‘లైగర్’ ఇష్యూష్తో విజయ్ చేయాల్సిన ‘జేజీఎమ్’ సిని మా క్యాన్సిల్ అయ్యింది.
విజయ్ ప్రస్తుత సినిమాలు
‘గీతగోవిందం’ వంటి హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ప్రస్తుతం ‘ఫ్యామిలీస్టార్’ సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఇందులో మృణాల్‌ఠాకూర్ హీరోయిన్. మార్చిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే ‘జెర్సీ’ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ ఓ స్పై ఫిల్మ్ కమిటైయ్యాడు. అలాగే తనతో టాక్సీవాలా చేసిన రాహుల్ సంకృత్యాన్‌తో ఓ సినిమా, ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ సినిమా, రవికిరణ్‌తో ఓ సినిమా చేయాలని విజయ్ చూస్తున్నాడు. డిస్కషన్లు జరుగుతున్నాయి.
ఏ స్టార్ హీరో సినిమా కెరీర్లో అయినా ఓ సినిమా అనుకోకుండా సెట్ కావడం, అన్నీ కుదరిన సినిమా క్యాన్సిల్ కావడం మాములే. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా విజయ్ దేవరకొండ స్టార్ హీరో అని ఆల్రెడీ ప్రేక్షకులు తేల్చేశారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి..