Jaihanuman Ramcharan: ఈ సంక్రాంతికి థియేటర్స్‌లో విడుదలైన ‘హను–మాన్’ సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులుపుతుంది. ఈ సినిమా ఇప్పటికే వందకోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. కె. నిరంజన్‌రెడ్డి నిర్మించారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానుందని ఆల్రెడీ ప్రకటించారు ప్రశాంత్ వర్మ. అయితే..దీంతో ‘హను–మాన్’ సినిమాలో రాముడి పాత్రలో ఎవరు నటించనున్నారు? అనే చర్చ ఆల్రెడీ మొదలైంది.
రాముడిగా రామ్‌చరణ్?
ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనీవర్స్లో భాగంగా ‘హను–మాన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానుంది. రాముడికి హనుమంతుడు ఏం ప్రామిస్ చేశాడు? అనే క్లిఫ్ హ్యాంగర్‌తో ముగిసింది ‘హను –మాన్’ సినిమా. సో..‘జై హనుమాన్’లో ఈ కథ ఉంటుంది. అయితే ఇందులో ఎవరు శ్రీరాముడిగా నటిస్తారు? ఎవరు హనుమంతుడి పాత్రలో నటిస్తారు? అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. ఆల్రెడీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతరామరాజుగా కనిపించిన రామ్‌చరణ్ లుక్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రాముడిగా రామ్‌చరణ్ (Jaihanuman Ramcharan) బాగుంటారనేది సినీ లవర్స్ చెబుతున్నమాట.
దీంతో ‘జై హనుమాన్’ సినిమాలో రాముడి పాత్రలో రామ్‌చరణ్ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. అల్లుఅరవింద్ ఓ నిర్మాతగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామా యణం సినిమాలో రామ్‌చరణ్ రాముడి పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ ఈ సినిమాలో ఇప్పుడు రణ్‌బీర్‌కపూర్ రాముడిగా చేస్తున్నారు. మరి…‘జై హనుమాన్’ సినిమాలో రాముడిగా రామ్‌చరణ్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
ప్రస్తుతం రామ్‌చరణ్ చేస్తున్న సినిమాలు
ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ సినిమా చేస్తున్నారు. శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. అలాగే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓసినిమా చేస్తున్నారు రామ్‌చరణ్. వెంకటసతీష్ కిలారు, మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.