Vijaydevarakonda: విజయ్‌దేవరకొండ (Vijaydevarakonda) పెళ్లిని గురించిన వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్నాలను గురించిన పెళ్లి వార్తలూ ప్రచారంలోకి వస్తూనే ఉంటాయి. తాజాగా విజయ్‌దేవరకొండ పెళ్లి వార్త మళ్లీ తెరపైకి వచ్చింది. ఫిబ్రవరిలో విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్నాలు నిశ్చితార్థం చేసుకో నున్నారని, త్వరలోనే వీరి పెళ్లిని గురించిన ప్రకటన రావొచ్చనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విష యంపై విజయ్‌దేవరకొండ స్పందించారు.
Vijaydevarakonda: విజయ్ హీరోగా ఆగిపోయిన 4 సినిమాలు ఇవే
‘‘నా పెళ్లిని గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. రెండేళ్లొకకసారి నాకు పెళ్లి జరుగుతూనే ఉం టుంది. ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం అన్న వార్తల్లో వాస్తవం’’ లేదు అని చెప్పుకొచ్చారు. అలాగే ‘లైగర్’ ఫ్లాప్‌ను గురించి విజయ్‌దేవరకొండ మాట్లాడుతూ–‘‘లైగర్’ కోసం నావంతు 100 శాతం కష్టపడ్డాను. కానీ సినిమా ఆడలేదు. ఇందంతా నా లైఫ్ జర్నీలో భాగం’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ, అనన్యాపాండే జంటగా వచ్చిన ‘లైగర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. 2022 ఆగస్టులో ఈ చిత్రం విడుదలైంది.