VijayDevarakonda కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు విజయ్ దేవరకొండ(Vijay devarakonda). ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కాల్సిన సినిమా(VD12) ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. స్పై బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాతెరకెక్కనుందనే టాక్ వినిపిస్తుంది. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు విజయ్‌దేవరకొండ. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఇక తనకు గీతగోవిందం వంటి బ్లాక్బస్టర్ఇచ్చిన పరశురామ్‌తో విజయ్‌దేవరకొండ మరో సినిమా చేస్తాడు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ చిత్రంత్వరోలనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే దర్శకుడు సుకుమార్‌తో విజయ్‌దేవరకొండకు ఓ సినిమా కమిట్మెంట్ ఉంది.
హీరో.. డైరెక్టర్..ఇద్దరి సినిమాలూ క్యాన్సిల్
విజయ్ దేవరకొండ, పూరీజగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘లైగర్’. ఈ సినిమా విడుదల కాకముందే ఈ ఇద్దరు కలిసి ‘జనగణమన’ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు. కానీ బాక్సాఫీస్ వద్ద ‘లైగర్’చిత్రం డిజాస్టర్‌గా నిలివడంతో ‘జనగణమన’ సినిమా కొంత షూటింగ్ జరుపుకుని కూడా క్యాన్సిల్అయ్యింది.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ సినిమాను ఇదే టైటిల్‌తో షాహిద్కపూర్తో తీశాడు. డిజాస్టర్గానిలిచింది. దీంతో రామ్‌చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమా ప్రస్తుతానికి అటకెక్కింది.