vijaydevarakonda: ఖుషి (kushi) సినిమా చిత్రీకరణ కోసం విజయ్ దేవరకొండ(vijaydevarakonda) కాశ్మీర్ పైన మవనన్నారు సమంత (samantha) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ కాశ్మీర్లో ప్రారంభం కానుంది ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కేరళలోని అలెప్పిలో జరిగింది. వారం రోజులపాటు జరిగిన అలెప్పి లొకేషన్స్ లో విజయ్ దేవరకొండ సమంతలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా, మే మొదటి వారంలో ఖుషి సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ కశ్మీర్లో మొదలవుతుంది. విజయ్ దేవరకొండ పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు చిత్ర యూనిట్ మూడు వారాలు జరిగే ఈ కాశ్మీర్ షెడ్యూల్ను ముగించుకొని వచ్చిన తర్వాత కాకినాడ, హైదరాబాద్ లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది . ఈ లొకేషన్స్ లో కూడా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత టర్కీలో ఓ సాంగ్ షూట్ ను ప్లాన్ చేశారు మేకర్స్ . ఇది కూడా పూర్తయితే ఖుషి సినిమా మేజర్ షూటింగ్ పూర్తవుతుంది సెప్టెంబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నారు.


వాట్ నెక్ట్స్
ఖుషి సినిమా కాకుండా ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతుల్లో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమాకు విజయ్ దేవరకొండ కమిటీ అయ్యారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలోనూ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెర్కెనుంది. అయితే ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ తో సుకుమార్ బిజీగా ఉండడంతో పరుశురామ్ దర్శకత్వంలోని సినిమా, కానీ గౌతం తిననూరి దర్శకత్వంలోని సినిమాను కానీ విజయ్ దేవరకొండ వీలైనంత తొందరగా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. వీటిలో ఏ సినిమా ముందుగా మొదలవుతుంది అనే విషయంపై ఓ స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.