Srinu Vaitla: వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు..ఇలా ఎన్నో సూపర్‌డూపర్ హిట్స్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు దర్శకులు శ్రీనువైట్ల. కానీ పదేళ్లుగా ఆయనకు మరో హిట్ దక్కలేదు. ఇక 2018లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ వైఫల్యం తర్వాత శ్రీనువైట్ల గ్రాఫ్ మరింత పడిపోయింది. ఎంతలా అంటే ఐదేళ్లుగా ఆయన తర్వాతి చిత్రం మరొకటి సెట్స్‌పైకి వెళ్లలేదు.
మంచు విష్ణుతో ‘ఢీ’కు సీక్వెల్‌గా ‘ఢీ2: డబుల్ డోస్’ సినిమాను ప్రకటించారు శ్రీనువైట్ల. కారణాలు తెలియకపోయిన ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. కానీ 2022లో దసరా ఫెస్టివల్ సందర్భంగాతన తర్వాతి చిత్రం హీరో గోపీచంద్‌తో ఉంటుందని ట్వీట్ చేశారు శ్రీనువైట్ల. ఈ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు. రీసెంట్‌గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో శ్రీనువైట్ల ఓ సినిమా చేస్తున్నట్లుగా ప్రచారంసాగుతోంది.
ప్రస్తుతం శ్రీనువైట్ల పరిస్థితి వాట్ టు డు వాట్ నాట్ టు డు అన్న పరిస్థితుల్లో ఉంది. త్వరలో శ్రీనువైట్ల నుంచి మరో మాంచి మూవీ రావాలని ఆయన జానర్ సినిమాలను ఇష్టపడేవారు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.