తమ్ముడు, గుడుంబా శంకర్, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్(Pawankalyan) హీరోగా నటించిన తో పాటు పాటలు పాడారు అయితే ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ మరో పాట పాడడానికి సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ మే మొదటి వారంలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలోని ఓ పాటను పవన్ కళ్యాణ్ పాడనున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడితే బాగుంటుందని ఈ చిత్రం సంగీత దర్శకుడు కీరవాణి సూచించారు. అతి త్వరలోనే ఈ పాట రికార్డింగ్ జరగని ఉందని ఫిలింనగర్ సమాచారం మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తుండటం విశేషం. పిరియాడికల్ డ్రామాగా భారీ బడ్జెట్ తో ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలని యోచనలో ఉన్నారు మేకర్స్.
హరిహర వీరమల్లో సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరో మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్‌సింగ్, యువ దర్శకుడు సుజిత్ తీస్తున్న ‘ఓజీ’(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్), సముద్రఖని డైరెక్షన్లోవినోదాయచిత్తమ్ తెలుగు రీమేక్స్‌లో నటిస్తున్నారు పవన్‌కళ్యాణ్. ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ కోసం పవన్ ముంబైలో ఉన్నారు.