తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటులు, దర్శక–నిర్మాత మనోబాల (Manobala) బుధవారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారయన. జనవరిలో ఛాతీ నొప్పికి సంబంధించి ఆయనకు ఓ మేజర్ ఆపరేషన్‌కూడా జరిగింది.
1953 డిసెంబరు 8న మనోబాల జన్మించారు. ఆయన దాదాపు 700 సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. దాదాపుగా నలభై సినిమాకు దర్శకత్వంవహించారు. నిర్మాతగా మూడు సినిమాలను నిర్మించారు. అందులో ఒకటి విడుదల కావాల్సి ఉంది.సీరియల్స్‌లో కూడా నటించారు మనోబాల.


ఇక తెలుగులో ‘కథానాయకుడు, పున్నమినాగు, గగనం(తెలుగులో..), మనసు మాయ సేయికే, మహానటి, దేవదాస్, రాజ్‌ధూత్, కాలేజ్‌కుమార్, వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాల్లో నటించారు మనోబాల. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.