Dhruv Vikram: తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) తెలుగులో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. కానీ హీరోగా కాదు. విజయ్‌దేవరకొండ, గౌతమ్తిన్ననూరి కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలి సిందే. స్పై యాక్షన్ ఫిల్మ్‌గా ఈ చిత్రం రానుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తారు. అయితే కథ రిత్యా ఈ సినిమాలో మరో హీరోకు స్కోప్ ఉందట. దీంతో ఈ పాత్రకు ధృవ్ విక్రమ్‌ను సంప్రదించారట గౌతమ్ తిన్ననూరి. ధృవ్ విక్రమ్ కూడా ఈ సినిమాకు ఆల్మోస్ట్ ఓకే చెప్పారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ నెలలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే విజయ్‌దేవరకొండ సినిమాలో ధృవ్ ఏ తరహా పాత్ర చేయబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
Vijay devarakonda: విజయ్‌దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం
Vijaydevarakonda: రెండేళ్లకొకసారి పెళ్లి చేస్తున్నారు: విజయ్‌దేవరకొండ
ప్రస్తుతం విజయ్‌దేవరకొండ ఫ్యామిలీస్టార్ చేస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా చిత్రీ కరణ ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. ప్రధానతారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోన్నట్లుగాతెలిసింది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తవుతుంది. మరోవైపు ధృవ్ విక్రమ్ కోలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. దర్శకుడు పా. రంజిత్ ఈ సినిమాకు ఓ నిర్మాత. ఈ నెలఖార్లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం అవుతుంది.
Vijayendra Prasad: బాహుబలి సెట్స్‌లో కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి!