హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్‌నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ కాంబినేషన్‌లోని ‘కేజీఎఫ్’ చిత్రానికి సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్, స్పెషల్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకూవచ్చిన ‘కేజీఎఫ్:ఛాప్టర్ 1’, ‘కేజీఎఫ్:ఛాప్టర్ 2’ చిత్రాలు వచ్చీ, బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. థర్డ్ ‘కేజీఎఫ్ 3’కి రంగం సిద్ధమౌతుంది.
ఈ తరుణంలో ‘కేజీఎఫ్’ ఆధారంగా తమిళంలో దర్శకుడు పా.రంజిత్ తంగలాన్ అనే సినిమా చేస్తున్నారు. విక్రమ్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్. ఇటీవలే ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభమైంది. కాగా ఈ సినిమా 1800 టైమ్‌లో ‘కేజీఎఫ్’లో ఎలాంటి పరిణామాలు చోటుకున్నాయి? అక్కడ పని వి«ధానం, శ్రామికుల జీవనవిధానం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు పా. రంజి త్. ఈ సినిమాలో విక్రమ్ సరికొత్తగా కనిపిస్తున్నారు. 2024లో ఈ సినిమాను విడుదల కానుంది.
కోలీవుడ్‌లో ధనుష్, వెట్రిమారన్‌ల కాంబినేషన్ సూపర్‌హిట్. వీరి కలయికలో ఇప్పటివరకు వచ్చిన ‘వడ చెన్నై’, ‘అసురన్’ చిత్రాలు ఆకట్టుకున్నాయి. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ‘కేజీఎఫ్’ ఆధారంగా ఓ సిని మాను తీసే ఆలోచనలో ఉన్నట్లుగా నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ((KE GnanavelRaja) )ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొ న్నారు. ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వాసులు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్న ఈ బంగారు గనుల కథలకు ప్రజెంట్ ఇండస్ట్రీలో మంచి గిరాకీ ఉన్నట్లు తెలుస్తుంది.
Saidharamtej: సాయిథరమ్‌తేజ్ విజయాన్ని ఓర్వలేకపోతున్నారా?