జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) మంచి జోరుమీద ఉన్నారు. ‘జనతాగ్యారేజ్’ చిత్రం తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ మరో సినిమా (NTR30) చేస్తున్న సంగతి తెలిసిందే. మిక్కిలినేని సు ధాకర్, కె.హరికృష్ణ, కళ్యాణ్‌రామ్ ఈ సినిమానునిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీకపూర్(Janhvi kapoor) కథానాయిక. ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ కూడ పూర్తయింది. రెండో షెడ్యూల్ చిత్రీకరణలో దాదాపు 3 కోట్ల రూపాలయ ఖర్చుతో వేసిన ఓ రైలు సెట్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ ఫైట్ ఎన్టీఆర్, సైఫ్‌అలీఖాన్‌ల మధ్య చిత్రీకరించారు.కెన్నీ బైట్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 5, 2024న విడుదల చేయాలను కుంటున్నారు. దేశంలో ఆదరణకు నోచుకుని తీరప్రాంతవాసుల నేపథ్యంలో ఈ సినిమాకథ, కథనం ఉంటాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెర కెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సీరియల్ నటి చైత్ర ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె సైఫ్‌అలీఖాన్ పాత్రకు భార్యగా కనిపిస్తారు. అలాగే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్‌వీడియోను విడుదలచేయాలనుకుంటున్నారు.
Jr.NTR : మూడు కోట్ల రూపాయల ఫైట్
1 Comment
1 Comment
-
Pingback: Jr.NTR Devara: గ్యాప్ తర్వాత రంగంలోకి దిగిన దేవర | tollywoodhub