Jr.NTR Devara: జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు. 2023 డిసెంబరులో ఓ లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన ఎన్టీఆర్, ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్నా రు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కోసం జపాన్ వెళ్లొచ్చారు. లేటెస్ట్గా గురువారం ‘దేవర’ (Devara) సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్,తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రం దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్. తెలుగులో జాన్వీకి ఇదే తొలి సినిమా.సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారని తెలిసింది. కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు సినిమారెండుపార్టులుగా విడుదల కానుంది. తొలిపార్టు ఏప్రిల్ 5న విడుదల కానుంది. ‘దేవర’కు అనిరు«ద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కాకుండా హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ చేయనున్నారు ఎన్టీఆర్. అలాగే ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రానుంది.