jrNTR Devara: తెలుగు చిత్రపరిశ్రమలో ఈ ఏడాది విడుదల కానున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘దేవర’. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘దేవర’ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. ‘జనతాగ్యారేజ్’ వంటిహిట్ ఫిల్మ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా యి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తంగమ్ పాత్రలో జాన్వీకపూర్ నటిస్తున్నారు. భైర పాత్రలో సైఫ్అలీఖాన్ కనిపిస్తారు. భైర భార్యగా టెలివిజన్ నటి చిత్ర నటించారు. కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘దేవర’ సినిమా ఏప్రిల్ 5 న విడుదల కానుంది.
‘దేవర’ సినిమా ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ‘దేవర’ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్‌ను సాధించాలంటే తప్పకుండ తెలుగుతో పాటు ఇతర భాషల్లోని ఇండస్ట్రీలోనూ బాగా ప్రదర్శనకు నోచుకోవాలి. కానీ ఈ పరిస్థితులు మెల్లిగా మారుతున్నాయి.
పోటీపడుతున్న కోలీవుడ్ స్టార్స్
తమిళంలో కమల్‌హాసన్, సూర్య, విక్రమ్‌ల సినిమాలు ఏప్రిల్ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇండియన్ వంటి భారీ హిట్ తర్వాత కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ‘ఇండియన్ 2’ తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్‌లో విడుదల కానుందనే టాక్ విని పిస్తోంది. సూర్య భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సోషియో ఫ్యాంటసీ సినిమా ‘కంగువా’ కూడా ఏప్రిల్ 11న విడుదల కానుందని తెలిసింది.
విక్రమ్ ‘తంగలాన్’ ఏప్రిల్ రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకుంది. ఈ మూడు సిని మాల్లో ఏ ఒక్క సినిమా అయిన ఏప్రిల్‌లో రిలీజ్ అయితే ‘దేవర’ స్క్రీన్స్ ఈ సినిమాకు షేర్ అవుతాయి. ‘ఇండియన్ 2’, ‘కంగువా’, ‘తంగలాన్’ సినిమాలు కూడా పాన్ ఇండియన్ మూవీస్ కాబట్టి హిందీలో థియేటర్స్ కేటాయింపులు చేసుకోవాల్సిందే. దీంతో ఆటోమేటిక్‌గా కలెక్షన్స్ తగ్గిపోతాయి. రికార్డులు దూరమవుతాయి. పైగా రెడ్ జెయింట్ మూవీస్‌కు తమిళ నాడులో స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ చైన్ ఉందన్న విషయం మర్చిపోకూడదు. లైకా ప్రొడక్షన్స్ కూడా తమిళంలో చాలా స్ట్రాంగ్ ప్రొడక్షన్ హౌస్.
హిందీలోనూ…
సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్వీరాజ్‌సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ తెలుగులో ‘ఆడు జీవితం’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. చెప్పిన తేదీకే ఈ సినిమా వస్తే…మాలీవుడ్‌లో దేవరకు స్క్రీన్స్ తక్కువ అవుతాయి. అలాగే హిందీలో అక్షయ్‌కుమార్, టైగర్‌ష్రాఫ్, పృథ్వీరాజ్సుకుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుందని తెలిసింది. సో…హిందీలో ‘దేవర’కు స్క్రీన్స్ తప్పకుండ తగ్గుతాయి. ‘దేవర’ సినిమా ఎంత పెద్ద హిట్ టాక్‌ను తెచ్చు కున్న కేవలం ఐదురోజుల రన్‌తో రికార్డులను అయితే సాధించలేదు. ఇలా..దేవర సినిమాను ఇతర ఇండస్ట్రీల స్టార్స్ చుట్టుముడుతున్నారు. మరి..‘దేవర’ సినిమా కంటెంట్ మితగా సినిమాల కన్నా స్ట్రాంగ్‌గా, ఆసక్తికరంగా ఉండి కొత్త కలెక్షన్స్ రికార్డులను ఎన్టీఆర్ సృష్టించాలని కోరుకుందాం.