గత నాలుగు సంవత్సరాలుగా ఎన్టీఆర్(jr.Ntr) హీరోగా థియేటర్స్‌లోకి వచ్చింది ‘ఆర్ఆర్ఆర్’ (RRR) (ఇందులో రామ్ చరణ్ మరో హీరో) చిత్రం మాత్రమే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్చరణ్మరో హీరో. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తనకు ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఇచ్చిన కొరటాల శివతో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. తొలి షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న తర్వాత షూటింగ్స్ నుంచి స్మాల్ బ్రేక్ తీసుకున్నారు ఎన్టీఆర్.
అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లడానికి ముందే ఎన్టీఆర్ హిందీ చిత్రం ‘వార్ 2’కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘బ్రహ్మాస్త్రం’ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హృతిక్‌రోషన్ మరో హీరోగా నటిస్తారు. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరులో సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నారట చిత్రం నిర్మాతఆదిత్యా చోప్రా.
సెప్టెంబరు అంటే కొరటాలతో ఎన్టీఆర్ చేసే సినిమా ముగింపు దశలో ఉంటుంది. ఇలా ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్‌పై ఎన్టీఆర్ ఏకాగ్రత చేస్తుండటం కరెక్ట్ కాదని, టాప్ హీరోగా ఓ సినిమాపై ఉంటే అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి తీరుతుందని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. మరి..ఎన్టీఆర్ చేస్తున్న ఈ రిస్క్ ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి.