Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) తో సినిమా చేయాలని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు (Dil Raju) ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవల రజనీకాంత్ కథ రెడీ చేసుకోవాల్సిందిగా ‘దిల్’ రాజుకు సూత్రప్రాయంగా చెప్పారు. దీంతో దర్శకుల వేటలో పడ్డారు ‘దిల్’ రాజు. ఆయన కాంపౌడ్‌లోని వంశీపైడిపల్లి, వేణు శ్రీరామ్వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే చాన్స్‌ను దర్శకుడు కేఎస్ రవీంద్ర దక్కించుకున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. రీసెంట్గాచిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్బాస్టర్ ఫిల్మ్ తీసిన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ గతంలో ఎన్టీఆర్‌తో ‘జైలవకువ’, రవితేజతో ‘పవర్’ వంటి సినిమాలు చేశారు. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్’ సినిమా చేస్తున్నారు. ఆయన కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ‘లాల్‌సలామ్’లో ఓ కీ రోల్ చేస్తున్నారు. వీటితో పాటు ‘జై భీమ్’ చిత్రాల ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్. ఈ సినిమాల షూటింగ్స్ పూర్తయిన తర్వాతే బాబీతో సినిమా ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇలోపు దర్శకుడు, కథ మారిపోయిన ఆశ్యర్యం లేదు. అధికారిక ప్రకటన
వస్తే మాత్రం ఒకే బాబీ రేంజ్ పెరిగినట్లే.