మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నారు. తమిళ హిట్ మూవీ అజిత్ ‘వేదాళం’కు ఈ చిత్రం తెలుగు రీమేక్. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే చిరంజీవి తర్వాతి చిత్రంపై ఇండస్ట్రీలో పలు ఊహాగానాలు నెలకొన్నాయి. దర్శకులు పూరీజగన్నాథ్, ప్రభుదేవా, బీవీఎస్ రవి వంటి వారు ఆయనకు కథలు వినిపించారనే టాక్ తెరపైకి వచ్చింది. నటి రాధిక నిర్మాణంలో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉండగా, ఆమె ద్వారా కూడా చిరంజీవి కొన్ని కథలు విన్నారు కానీ లాభం లేకపోయింది. కానీ చిరంజీవి తర్వాతి చిత్రంపై ఓ క్లారిటీ రాలేదు.
అయితే కళ్యాణ్‌రామ్‌కు ‘బింబిసార’ వంటి హిట్ వచ్చిన వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి తర్వాతి చిత్రంఫిక్స్ అయినట్లుగా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్, చిరంజీవి కూతురు సుష్మితా కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనుందనీ, త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక ‘భీష్మ’, ‘చలో’ చిత్రాల ఫేమ్ వెంకీ కుడుములతో చిరంజీవి చేయాల్సిన ప్రాజెక్ట్ హోల్డ్‌లో ఉంది. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాత.