‘కలర్‌ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాల తరవాత సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబా జీపేట మ్యారేజ్ బ్యాండు’. బన్నీవాసు, వెంకటేశ్మహా సమర్పణలో జీఏ2 పిక్చర్స్, స్వేచ్ఛ క్రియేష¯Œ్స, వెంక టేశ్ మహా నిర్మాణంలో దుశ్యంత్ కటికనేని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సుహాస్ తోపాటుగా గోపరాజు రమణ, ‘పుష్ప’ ఫేమ్ జగదీశ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అంబాజీపేట మ్యారేజ్బ్యాండు’లో పనిచేసే కుర్రాడు మల్లి కథే ఈ చిత్రంగా తెలుస్తోంది.