Keerthysuresh UppukappuRambu: వీలైనప్పుడల్లా డిఫరెంట్ సినిమాలు చేస్తుంటారు కీర్తీసురేష్. తాజాగా అలా ఓ కథ నచ్చి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు(Keerthysuresh UppukappuRambu). అదే ‘ఉప్పుకప్పు రంబు’. ‘కలర్‌ఫోటో’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ వంటి సినిమాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతున్న సుహాస్ ఈ చిత్రంలో ఓ లీడ్ రోల్లో నటిస్తారు. మరి కథ రిత్యా సుహాస్‌కు జోడీగా కీర్తీ సురేష్ నటిస్తారా? లేదా అనేది చూడాలి.
విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఓ ఊరి స్మశానంలో తగిన స్థలం లేనప్పుడు ఓ ఇద్దురు వ్యక్తులు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉం టుందట. శశి ఈ సినిమాకు దర్శకుడు. వసంత్ మురళీకృష్ణ మరింగంటి ఈ సినిమాకు కథ అందించారు. రాధికా లావు నిర్మాత. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ అవుతుందా? లేక డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందా? అనే విషయాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది.