జూనియర్ ఎన్టీఆర్(jr.ntr) ఇంట్లో మార్చి 12 బుధవారం గ్రాండ్ నైట్ పార్టీ సెలబ్రేషన్స్ జరిగాయి. అమెజాన్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు జేమ్స్ ఫారెల్ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొని, సందడి చేయడం ఇండస్ట్రీలోహాట్‌టాపిక్‌గా మారింది.
అయితే ఈ వేడుకలో దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్‌తో సహా చాలామందిదర్శకులు, నిర్మాతలు కూడా పాల్గొన్నారు. కానీ హీరోలు ఎవరూ పాల్గొనలేదు. అంటే ఎన్టీఆర్ నుంచిఏ హీరోకు కూడా ఆహ్వానం అందలేదని, కేవలం ఎన్టీఆర్‌కు సన్నిహితులైన కొందరు దర్శక–నిర్మాతలకు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ నుంచి పిలుపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఈ వేడుకల్లో పాల్గొనలేకపోయారు.
అయితే సడన్‌గా జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీ ఎందకు ఇచ్చినట్లు….అమెజాన్ స్టూడియోస్‌కు సంబంధించి ఏదైనా ఇంటర్‌నేషనల్ ప్రాజెక్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ భాగం కాబోతున్నారా? అనే ఊహాగానాలు కూడా ఇండస్ట్రీలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మలి షెడ్యూల్ గోవాలో జరగనున్నట్లుగా తెలుస్తోంది. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మిక్కిలినేని సుధాకర్, కె.హరికృష్ణ, కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్5న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.