NTR30: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారు. కె.హరికృష్ణ, కళ్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సిని మాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ సినిమారెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలోని మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్‌కు కెన్నీబెట్స్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. హాలీవుడ్ చిత్రాలు మిషన్ఇంపాజిబుల్, ఇండియాలో ‘2.ఓ’, ‘సాహో’ వంటి వాటికి గతంలోకెన్నీబెట్స్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఇలా ఈ సినిమా తొలి షెడ్యూల్లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్నుటీమ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.
Renowned Action Producer #KennyBates joins the team of #NTR30 & is choreographing major action sequences 🔥
Conceptualization in progess!@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @sabucyril @RathnaveluDop @YuvasudhaArts pic.twitter.com/IfvrNB9v2a
— NTR Arts (@NTRArtsOfficial) March 25, 2023
ఇండియాలో గుర్తింపుకు నోచుకుని తీరప్రాంతాల్లో కొందరు జీవిస్తుంటారు. వారంతా మృగాల మనస్తత్త్వంతో ఉన్న మనుషులువారు. కానీ వీరందరూ ఓ అంశానికి భయపడుతుంటారు? ఎందుకు అనేది సినిమాలో చూ డాలి. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు.
NTR30: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో NTR 30 గ్రాండ్ లాంచ్