RC15: రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటుంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, అంజలి కీ రోల్స్చేస్తున్నారు. ‘దిల్’రాజు, శిరీష్‌లు నిర్మాతలు. ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్షెడ్యూల్ పూర్తయింది. హీరోహీరోయిన్లు రామ్‌చరణ్, కియారా అద్వానీలపై ఓ సాంగ్‌ను చిత్రీకరించారు యూ నిట్. ఈ సాంగ్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయడం విశేషం. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. అయితేరామ్చరణ్ ముందస్తు బర్త్ డే సెలబ్రేషన్స్ ఈ సినిమా సెట్స్‌లో జరిగాయి. రామ్‌చరణ్ బర్త్ డే మార్చి 27న అని అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. జనవరి 13, 2024న రిలీజ్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
సీఈఓ టైటిల్?
ఇక రామ్‌చరణ్ బర్త్ డేని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించాలనే ఆలోచనలో చిత్రంయూనిట్ఉన్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో ఐఏఎస్ ఆఫీసర్ల నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాకు ‘సీఈవో’ అనేటైటిల్ అనుకుంటున్నారు. ట్రాక్టర్ సింబల్‌తో అభ్యుదయ అనే రాజకీయపార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినఓ వ్యక్తి కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది? అన్నది కథనం. రాజకీయాల్లో తండ్రికి జరిగిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకునే పాత్రలో రామ్‌చరణ్ నటిస్తారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్ కూడా కీలకం కా నుంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకుల పాత్రల్లో రామ్‌చరణ్ నటిస్తున్నారు.
బర్త్ డే రోజున న్యూ అనౌన్స్మెంట్స్?
రామ్‌చరణ్ బర్త్ డే రోజున కొత్త ప్రకటనలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రామ్‌చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. సెప్టెంబరులో ఈ సినిమా షూటింగ్ మొదలు అవుతుంది. ఈ చిత్రం అప్డేట్ కూడా మార్చి 27న రావొచ్చు. అలాగే రామ్‌చరణ్ చేయనున్న మరో నెక్ట్స్ప్రాజెక్ట్ను గురించిన అప్డేట్ను కూడా ఆశిస్తున్నారు ఆయన అభిమానులు.