Pawankalyan: సూపర్‌స్పీడ్‌లో ఉన్నాడు పవన్‌కళ్యాణ్. తమిళ దర్శక–నిర్మాత నటుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో పవన్‌కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌కు చెందిన టా కీ పార్టు షూటింగ్ పూర్తయింది. శరవేగంగా పవన్‌కళ్యాణ్ టాకీ పార్టును పూర్తి చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌పై చిత్రీకరించాల్సిన ఓ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. తమిళం హిట్ వినోదాయ చిత్తమ్కు తెలుగు రీమేక్‌గా రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాను జూలై28న థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దర్శకుడు త్రి విక్రమ్ ఈ సినిమాకు స్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తుండటం విశేషం.
Thank you God 🧿. We have successfully completed our talkie portion of Kalyan sir.
See you all in theatres on July 28 🙏🏻..VELVOM…💪💪💪💪💪💪💪❤️❤️❤️❤️
pic.twitter.com/BiAzIzPn36
— P.samuthirakani (@thondankani) March 25, 2023
ఇక ఈ సినిమా కాకుండా ‘గబ్బర్‌సింగ్’ తర్వాత దర్శకుడు హరీష్‌శంకర్‌తో ‘ఉస్తాద్’ సినిమా చేస్తున్నారు పవన్‌కళ్యాణ్. తమిళ హిట్ ‘తేరీ’కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుందనే టాక్ వినిపిస్తోంది.మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలోనూ ‘ఓజీ’(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే సినిమాకు కమిటైయ్యారు పవన్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై త్వరలో ఓ స్పష్టత రావాల్సి ఉంది.