‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్(NTR), దర్శకుడు కొరటాల శివ (Koratalashiva) కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోజరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, సైఫ్అలీఖాన్ల మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కోసం రూపుదిద్దిన రైలు సెట్లో ఎన్టీఆర్, సైఫ్‌ల మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారుదర్శకుడు కొరటాల శివ. ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయినట్లుగా సమాచారం. ఈ సినిమామూడో షెడ్యూల్ చిత్రీకరణ ఎన్టీఆర్ బర్త్ డే అంటే మే 20 తర్వాత ప్రారంభం కానుందని తెలిసింది. జాన్వీకపూర్(Jhanvi kapoor) హీరోయిన్గా నటిస్తున్నారు. భారతదేశంలో విస్మరణకు గురైన తీరప్రాంతాల్లోని నివాసుల నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా ఉండబోతుంది. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనాఅప్డేట్ రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కళ్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, కె.హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024, ఏప్రిల్ 5న విడుదలకానుంది.
ఈ సినిమాను ఇలా కొనసాగిస్తూనే బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్‌రోషన్ ఓ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారం భం కానుంది. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్‌కు ఓ కమిట్మెంట్ ఉన్న సంగతి తెలిసిందే.