ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం అతి త్వరలోనే ఫారిన్ వెళ్లనున్నారు మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ (Varuntej). ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా ‘గాంఢీవదారి అర్జున’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.సాక్షీ ౖవైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్‌ను హంగేరిలో జరపాలనిచిత్రంయూనిట్ భావించదని సమాచారం. ఇందుకోసం మే మొదటివారంలో వరుణ్‌తేజ్ హంగేరి వెళ్లనున్నారట. అక్కడ దాదాపు ఇరవై రోజులు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను తీస్తారట చిత్రంయూనిట్. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ సినిమాతో వరుణ్‌తేజ్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. మానుషీ చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్.
Varuntej : హంగేరీ వెళ్తున్న వరుణ్ తేజ్.. ఎందుకో తెలుసా..?
Leave a comment
Leave a comment