నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ‘ది ఘోస్ట్’ ఆడియన్స్‌ను తీవ్రం, అక్కినేని ఫ్యాన్స్‌ను ఇంకా ఎక్కువ తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కథల ఎంపికకు కాస్త బ్రేక్ తీసుకున్నారు నాగార్జున. స్క్రిప్ట్‌లో పస లేనిదే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లున్నారు. అయితే ఫైనల్‌గా నాగార్జునకు ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ నచ్చిందట.‘నేను లోకల్’, «‘ధమాకా’ వంటి సినిమాలకు రైటర్‌గా పనిచేసిన బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారట.1980 పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథను శ్రీనివాస చిట్టూరి నిర్మించ నున్నారనిఫిల్మ్‌నగర్ భోగట్టా.
అంతేకాదండోయ్..ఈ కథ మల్టీస్టారర్ ఫిల్మ్ అని, ఇందులో ‘అల్లరి’ నరేశ్ ఓ కీ రోల్ చేయనున్నారని టాలీవుడ్ టాక్.‘బంగార్రాజు’ సక్సెస్‌మీట్ సమయంలో తాను అఖిల్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్లుగా ప్రక టించారు నాగార్జున. ఈ సినిమాకు దర్శకుడిగా మోహన్‌రాజా పేరు తెరపైకి వచ్చింది. అయితే ముందుగా బెజవాడ ప్రసన్నకుమార్ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లి, ఈ సినిమా షూటింగ్ అంతా ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే అఖిల్‌తో మల్టీస్టారర్ ఫిల్మ్‌ను స్టార్ట్ చేయాలని నాగార్జున భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.
TAGGED:
Akhil Akkineni, Akkineni nagarjuna, Allari Naresh, Nag100, Nag99, nagarjuna
TollywoodHub