సినిమా: ఏజెంట్
ప్రధాన తారాగణం: అక్కినేని అఖిల్, మమ్ముట్టీ, డినోమోరియా, సాక్షీ వైద్య
నిర్మాణం: అనిల్‌సుంకర ఏకే ఎంటర్ట్మైంట్స్, రామబ్రహ్మాం సుంకర
బడ్జెట్: దాదాపు వందకోట్లు
మ్యూజిక్ డైరెక్టర్: హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
విడుదల: ఏప్రిల్ 28, 2023 (తెలుగు, మలయాళం)
ఓ సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ హిట్ కోసం అఖిల్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు వక్కంతం వంశీ అందించిన కథతో కమర్షియల్చిత్రాల దర్శకుడిగా పేరున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ సినిమా చేశాడు అఖిల్. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా జర్నీ సాగింది. దాదాపు వందకోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తీశారు. మరి..అఖిల్ ఎప్పట్నుంచో కోరుకుంటున్న మాస్ ఇమేజ్, యాక్షన్ హీరో ట్యాగ్ ఏజెంట్‌తో వచ్చిందా? మీరే…చదవండి.
కథ
‘ఏజెంట్’ కథ ప్రధానంగా ‘రా’(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) చీఫ్ మహాదేవ్(మమ్ముట్టీ) ఆలియాస్ డెవిల్, జీవితంలో ‘రా’ ఏజెంట్ కావాలనే లక్ష్యంతో ఉన్న రామకృష్ణ ఆలియాస్ రిక్కీ (అక్కినేని అఖిల్) ‘రా’ మాజీ ఏజెంట్ ధర్మ ఆలియాస్ గాడ్ (డినోమోరియా)ల మధ్య సాగుతుంది. ‘రా’ చీఫ్ మహాదేవ్‌కి నమ్మినబంటులా ఉంటూ అతను చెప్పిన పనల్లా చేస్తూ, మహాదేవ్ చేత ది బెస్ట్ అనిపించుకుంటుంటాడు ధర్మ. కానీ దేశంలోని అన్ని సెక్టార్స్‌ను రూల్ చేయాలనుకనే ఓ సిండికేట్ మాఫియా ఆగడాలను ఆరి కట్టడానికి ఓ మిషన్‌ను ధర్మకు అప్పగిస్తాడు మహాదేవ్. కానీ ఈ మిషన్‌లో భాగంగా ధర్మ తన ప్రేయసిని తానే చంపేయాల్సివస్తుంది. దీంతో మహాదేవ్‌కి రివర్స్ అయిన ధర్మ ఆ సిండికేట్‌కు డాన్ అవుతాడు. మహాదేవ్‌ను ఇబ్బందిపెడుతుంటాడు. ఈ క్రమంలో ధర్మ మిషన్ రాబిట్ అనే ఓ కొత్త ఆపరేషన్‌ను స్టార్ట్ చేసి, ఇండియాలో బాంబ్ బ్లాస్ట్‌లు ప్లాన్ చేస్తాడు. ఈ బ్లాస్ట్లను ఆపేందకు ఏజెంట్ రామకృష్ణ, మహాదేవ్‌లు మరోప్లాన్నుసిద్ధం చేస్తారు. మరి.. ఏథికల్ హ్యాకర్ నుంచి ‘రా’ ఏజెంట్‌గా మారిన రామకృష్ణ ‘ఆపరేషన్ రాబిట్’నుఅడ్డుకుంటాడు. ఈ క్రమంలో రామకృష్ణకు ఎదురైన సవాళ్లు ఏమిటి? సెంట్రల్ మినిస్టర్ జై కిషన్ (సంపత్‌రాజ్)ను రామకృష్ణ ఎందుకు చంపుతాడు? అన్న విషయాలను సినిమాలో చూడాల్సిందే.
స్పై డ్రామాగా రూపొందిన ఈ ఏజెంట్ కథలో కొత్తదనం ఏమీ ఉండదు. కథనం ప్లాట్‌గా సాగుతుంది. ‘రా’ ఏజెంట్‌గా మారేందుకు రామకృష్ణ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో మహాదేవ్‌ని ఇంప్రెస్ చేయడం అన్నవికూడా కొత్తగా అనిపించవు. ఈ మధ్యలో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఆడియన్ సహానాన్ని పరీక్షిస్తుంది. అయితే ప్రీ ఇంట్రవేల్లో సెంట్రల్మినిస్టర్ జై కిషన్‌కు రామకృష్ణ ఇచ్చే వార్నింగ్ ఇచ్చే సీన్ మాత్రం హైలైట్.ఇంట్రవెల్ యాక్షన్ బ్యాంగ్ కూడా ఆసక్తికరంగా ఉండదు. సిండికేట్ నెట్‌వర్క్‌లోకి రామకృష్ణ రావాల నుకుంటున్నాడని, గాడ్‌కు ముందే తెలిసినా..రామకృష్ణ ప్రతిభను ఏంటో తెలుసుకోవాలనుకోవాలన్నట్లుగా ధర్మ తన వాళ్లనే చంపుకోవడం వంటివి విసుగు తెప్పిస్తాయి. సెంకడాఫ్‌లో అఖిల్‌ను టార్చర్ చేసే సీన్‌కూడా అంతంతమాత్రమే. ప్రతి సీన్లో ఓ గన్ షాట్..ఒకరి మరణం..ఇదే ఉంటుంది తప్ప కథలో మేటర్ఉండదు. క్లైమాక్స్ కూడా పేలవంగా ఉంటుంది. మిషన్రాబిట్ను ఆపరేట్ చేయడంలో ఎంతో కీలకమైన ఇర్ఫాన్‌ను పట్టుకున్న తర్వాత కూడా ‘రా’ చీఫ్ మహాదేవ్ అతన్ని నుంచి ఏ సమాచార్ని సేకరించకుండ,ఏజెంట్ రామకృష్ణపైనే ఆధారపడటం అనేది కథలోపానికి ఓ నిదర్శనం. అలాగే రామకృష్ణ ఏజెంట్లాఎందుకు మారాలనుకున్నాడు? అనే ప్లాష్బ్యాక్ను సరిగ్గా ఏస్టాబ్లిస్ చేయలేకపోయారు. ధర్మ ప్లాష్ బ్యాక్ కూడా ఏదో ఉండాలి కదా అన్నట్లు ఉంటుంది. మహాదేవ్‌ను చంపే ఎన్నో అవకాశాలు ధర్మకువచ్చినా, అలా చేయడు. కానీ క్లైమాక్స్‌లో మహాదేవ్ చావును బలంగా కోరుకుంటాడు ధర్మ. ఇలాంటిఅంశాలు సినిమాలో మరికొన్ని ఉన్నాయి. ఇటు మ్యూజిక్ పరంగా కూడా పెద్దగా ఏమీ లేదు. హిప్హాప్ తమిళ పెద్ద ఎస్సెట్ కాలేకపోయారు. ఇక సందర్భానుసారంగా వచ్చే ‘గోవిందా..గోవిందా’ సాంగ్, వైల్డ్సాంగ్ పాటలు ఆడియన్స్‌కు విసుగు తెప్పిస్తాయి. ‘ఏజెంట్’సినిమా కథనం ఇటీవల విడుదలైన షారుక్‌ఖాన్ ‘పఠాన్’ను ఓ సారి గుర్తుకు తెస్తుంది.
Agent: షారుక్ ‘పఠాన్’..అఖిల్ ‘ఏజెంట్’ కథ సేమ్ టు సేమ్?
నటన పరంగా అఖిల్ గత సినిమాలతో పోలిస్తే మెరుగైయ్యాడనే చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమాలో అఖిల్ కష్టం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లో అఖిల్ శ్రమ కనిపిస్తుంది. యాక్షన్ పరంగా డినోమోరియా ఒకే అనిపిస్తాడు. ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్లా భావించిన మమ్ముట్టీ పాత్ర రూపకల్సన ఆడియన్స్ ఊహించినంత పాజిటివ్‌గా అయితే ఉండదు. అయితే మమ్ముట్టీ కథ ప్రకారం బాగానే యాక్ట్ చేశారు. ఏటొచ్చి కమర్షియల్ సినిమాల్లో మంచి అనుభవం ఉన్న సురేందర్‌రెడ్డి ‘ఏజెంట్’ ఇలా డీల్ చేస్తారని అక్కినేని ఫ్యాన్స్ ఊహించి ఉండరు. వక్కంతం వంశీ కథపై మరింత వర్క్ చేయాల్సింది. ఇక హీరోయిన్ సాక్షీ వైద్యకు పెర్ఫార్మెన్స్ ఉన్న సీన్స్ తక్కువే ఉన్నాయని చెప్పుకోవాలి. యాక్షన్ థ్రిల్లర్స్‌లో హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదనే విషయం ఈ సినిమాతో మరోసారి నిరూపితమైంది.
బలాలు
కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు,
బలహీనతలు
కథ, కథనం
మ్యూజిక్
మీతిమీరిన యాక్షన్
ఫైనల్‌గా…బోరింగ్ ఏజెంట్ (1.75/5)
Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ పూర్తి రివ్యూ (రెండు పార్టలు కలిపి)
Agent: ఏజెంట్…బ్రేక్ ఈవెన్ అయ్యేలా లేదుగా…!