అఖిల్ (Akhil) హీరోగా నటించిన ‘ఏజెంట్’ (Agent) సినిమాను సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు అనిల్‌సుంకర. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాణంలో సురేం దర్ రెడ్డి కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు 40 కోట్లరూపాయలుగా ఉంది. కానీ ఏప్రిల్ 28న తెలుగు, మలయాళం భాషల్లో విడుదలైన ‘ఏజెంట్’ సినిమా కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. తొలిరోజు 8.60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన ఈ చిత్రానికితొలి రోజు షేర్ దాదాపు 5 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చిందని ట్రేడ్ వర్గీయులు చెబుతున్నారు. ఈఈ బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం ‘ఏజెంట్’ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే మరో 35 కోట్ల రూపాయలుకావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమైయేట్లు లేదు. ఒక విధంగా చూస్తే ‘ఏజెంట్’ బ్రేక్ ఈవెన్ సాధించకుండానే థియేట్రికల్ ఫుల్ రన్‌ను కంప్లీట్ చేసుకునేలా ఉంది. అయితే అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఇంత డిజాస్టర్‌గా నిలవడం అఖిల్‌ను మాత్రమే కాదు..అక్కినేని ఫ్యాన్స్‌ను బాధపెడుతుంది.
Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ పూర్తి రివ్యూ (రెండు పార్టలు కలిపి)
Akhil Agent Review: అఖిల్ ఏజెంట్ మూవీ రివ్యూ
Agent: షారుక్ ‘పఠాన్’..అఖిల్ ‘ఏజెంట్’ కథ సేమ్ టు సేమ్?