షారుక్‌ఖాన్ ‘పఠాన్’, అఖిల్ ‘ఏజెంట్’ సినిమాల మధ్య సారూప్యత కనిపిస్తుంది. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ‘పఠాన్’ ప్రధానంగా ముగ్గురు ఏజెంట్స్ అయిన పఠాన్(షారుక్‌ఖాన్), ఐఎస్‌ఐ ఏజెంట్ రూబినా (దీపికా పదుకొన్), మాజీ ‘రా’ ఏజెంట్ జిమ్(జాన్ అబ్రహాం)ల మధ్య జరు గుతుంది. అయితే ఇప్పుడుఅఖిల్ ‘ఏంజెంట్’ కథ కూడా ప్రధానంగా ముగ్గురు ఏజెంట్స్ అయిన రామకృష్ణ(అక్కినేని అఖిల్), ‘రా’
చీఫ్ మహాదేవ్ (మమ్ముట్టీ), ‘రా’నుంచి బయటకు నెట్టివేయబడి ‘రా’పై పగ తీర్చుకోవాలనుకునే ‘దిగాడ్’( డినో మోరియా)ల మధ్య సాగుతుంది.
‘పఠాన్’ చిత్రంలో ‘రా’ ఏజెంట్‌గా జిమ్ వర్క్ చేసి మంచి సమర్థుడిగా పేరు తెచ్చుకుంటాడు. కానీ ఓ మిషన్‌లో భాగంగా ఉగ్రవాదాలు జిమ్‌ను, అతని భార్యపిల్లలను బంధించి పదికోట్లు డిమాండ్ చేస్తారు.ఈ సమయంలో జిమ్ ‘రా’ చీఫ్‌కు ఫోన్ చేయగా, ఉగ్రవాదులతో తాము చర్చలు జరపమని తేల్చిచెబుతాడు. దీంతో ఆ ఉగ్రవాదాలు జిమ్ కళ్లముందే గర్భవతి అయిన అతని భార్యను తుపాకీతో కాల్పిచంపుతారు. దీంతో ‘రా’పై జిమ్ పగపట్టి ఇండియాపై బయోవార్ ప్లాన్ చేస్తాడు. అలాగే తన భార్య చావుకుకారణమైన ‘రా’ చీఫ్‌పై పగ తీర్చుకోవాలనుకున్నాడు. పగతో రగలిపోతున్న జిమ్‌ను అంతం చేస్తాడు‘పఠాన్’.
ఇప్పుడు సేమ్ ‘ఏజెంట్’ కథ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. ‘రా’ చీఫ్ మహాదేవ్‌పై పగ తీర్చుకోవడం, ‘రా’పై దాడి చేయ డమే ‘ది గాడ్’ లక్ష్యమన్నట్లుగా డినో మోరియా ఇంటర్యూలో చెప్పా రు. అలాగే ‘ఏజెంట్’ చిత్రం అనేది ముగ్గురు ఏజెంట్స్ మధ్య జరిగే కథ అని అఖిల్ రీసెంట్‌గా ‘ఏజెంట్’ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చారు.
అందుకే హిందీలో రిలీజ్ చేయడం లేదా?
‘ఏజెంట్’ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఆల్రెడీ ‘పఠాన్’ వచ్చీ హిట్ కావడంతో హిందీ రిలీజ్‌ను ‘ఏజెంట్’ ఆపేసినట్లు ఉన్నారు. తమిళంలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విడుదలఅవుతుంది. సో..అక్కడ చాన్స్ లేదు. కన్నడంలో అఖిల్‌కు పెద్ద మార్కెట్ లేదు.సో…క్రేజ్ ఉంది కాబట్టితెలుగులో, మలయాళంలో మమ్ముట్టీకి క్రేజ్ ఉంది కాబట్టి మలయాళంలో ‘ఏజెంట్’ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
‘పఠాన్’ సినిమా ముందుగా రిలీజ్ అయినప్పటికీని ప్రొడక్షన్ పరంగా ‘ఏజెంట్’ సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళ్లింది. కానీ వివిధ కారణాల వల్ల పలుసందర్భాల్లో రిలీజ్‌లు వాయిదాలు పడి ఫైనల్‌గా ఇప్పుడు రిలీజ్ అవుతుంది ‘ఏజెంట్’.
‘పఠాన్’, ‘ఏజెంట్’ల మధ్య సారుప్యత కనిపిస్తున్నప్పటికీని అఖిల్, డినోమోరియా చెప్పిన్నట్లుగా రెండు కథలు విభిన్నంగా ఉండాలని, ‘ఏజెంట్’ చిత్రం విజయం సాధించాలని అఖిల్ ఫ్యాన్స్ అయితే మాత్రం బలంగా కోరుకుంటున్నారు.
దర్శకుడు వక్కంతం వంశీ ‘ఏజెంట్’ సినిమాకు కథ అందించగా, సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. అనిల్‌సుంకర నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023లో థియేటర్స్‌లో విడుదల అవుతుంది.