అక్కినేని వారసుడిగా అఖిల్‌పై, అక్కినేని అభిమానులు లెక్కలేనన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ అఖిల్ కెరీర్లో మాత్రం సెట్ కావడం లేదు. మాస్ సినిమా చేసినా, క్లాస్ సినిమా చేసినా..ఓకే అనిపిస్తున్నాడు కానీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు సూపర్‌హిట్ కాలేదు. ‘ఏజెంట్’ సినిమా కోసం
అఖిల్ చాలా కష్టపడ్డాడు. పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలనుకున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇందుకు కారణం లేకపోలేదు. షారుక్‌ఖాన్ కెరీర్లో వందకోట్ల రూపాయల క్లబ్లో చేరిన సినిమా ‘పఠాన్’. ఈ చిత్రం జనవరిలో విడుదలైంది. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ స్టోరీలైన్‌తో వచ్చిన ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్‌లో విడుదలైంది. ఆడియన్స్‌కు నచ్చలేదు. దీంతో అఖిల్ కష్టం అంతా వృధా అయిపోయింది.
ఇప్పుడు వరుణ్తేజ్ది సేమ్ పోజిషన్. హృతిక్‌రోషన్ హీరోగా హిందీలో ఫైటర్ అనే సినిమా వస్తోంది. ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకుడు. దీపికా పదుకొనె, అనిల్‌కపూర్, కరణ్‌సింగ్ గ్రోవర్ కీలక రోల్స్ చేశారు. ఈ చిత్రం జనవరి 25న విడుదల కానుంది. భారత వైమానిక దళం సాహసాలు, ధైర్యాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. శత్రుదేశాలు భారత్‌పై దాడి చేయడం, భారత్ వైమానిక దాడి చేసి పగ తీర్చుకోవడం ఇది ‘ఫైటర్’ కథ.
Agent: షారుక్ ‘పఠాన్’..అఖిల్ ‘ఏజెంట్’ కథ సేమ్ టు సేమ్?
సేమ్..వరుణ్‌తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ కథ కూడ ఆల్మోస్ట్ ఇదే తరహాలో ఉందని ఇటీవల విడుదలైన ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది.
సో..కథ ఓకేలా ఉండటం, హృతిక్‌రోషన్ ‘ఫైటర్’లో చేయడం అనేవి వరుణ్‌తేజ్‌కు ప్రతికూల అంశాలు. పైగా ‘ఆపరేషన్ వాలెంటైన్’కు దర్శకుడు కొత్త. శక్తికాంత్ ప్రతాప్ హుడాకు ఇదే తొలి చిత్రం. సో..ఏదైనా తేడా కొడితే.. ‘పఠాన్’తో అఖిల్ పడ్డ ఇబ్బందులే, ‘ఫైటర్’తో వరుణ్ పడాల్సి వస్తుంది. మరోవైపు వరుణ్‌తేజ్ గత చిత్రాలు ‘గని’, ‘గాంఢీవదారి అర్జున’ వంటి సినిమాలు పరాజయం పాలైన నేపథ్యంలో వరుణ్‌కు ఈ సినిమా హిట్ కెరీర్ పరంగా చాలా కీలకం. మరి.. ఏం జరుగుతుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ.