పొన్నియిన్ సెల్వన్ రివ్యూ
ప్రధాన తారాగణం: విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, శోబితా ధూలిపాళ్ల, ప్రకాష్‌రాజ్, జయరాం, ప్రభు, శరత్‌కుమార్, పార్తీబన్, రెహమాన్
దర్శకత్వం: మణిరత్నం (కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ పుస్తకం ఆధారంగా..)
కథనం: మణిరత్నం, జయామోహన్, కుమారవేల్
నిర్మాణం: సుభాస్కరన్, మణిరత్నం
సంగీతం: ఏఆర్ రెహమాన్
కెమెరా: రవి వర్మన్
బడ్జెట్: 450 కోట్లు
పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) సినిమాను ఎందరో తమిళ ప్రముఖులు తెరకెక్కించాలని ప్రయత్నించారు. ఏంజీఆర్ వంటి మహానటులకూ సాధ్యపడలేదు. కమల్‌హాసన్ వంటివారు కూడా ఈ సాహసం చేయలేకపోయారు.అయితే ఓ సారి ప్రయత్నంచి విఫలమైన దర్శకుడు మణిరత్నం ఎట్టకేలకు మలి ప్రయత్నంలో సఫలీకృతులైయ్యారు. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ పుస్తకం ఆధారంగా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాను తీసి ఆయన మార్క్ ప్రతిభను ప్రేక్షకులకు మరోసారి చూపించారు.
పొన్నియిన్ సెల్వన్1 రివ్యూ…
పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్య నేపథ్యంలో సాగే కథే ‘పొన్నియిన్ సెల్వన్’. చోళ సామ్రాజ్య అధినేత రాజుసుందర చోళుడు(ప్రకాష్‌రాజ్)కు ముగ్గురు సతానం. ఆదిత్య కరికాలుడు(విక్రమ్), అరుళ్‌మోణి వర్మ (‘జయం’ రవి), కుందవై(త్రిష). కరికాలుడు యుక్తవయసులో ఉన్నప్పుడు తంజావూర్‌లోని ఓ దేవాయలం పూజారి కూతురు నందిని(ఐశ్వర్యారాయ్)ని ఇష్టపడతాడు. నందినీ, కరికాలుడు ప్రేమించుకుంటారు. ఆ వయసు లోనే నందినీని రాజమహాల్‌కు తీసుకుని వెళ్లి చోళపట్టపు రాణి అంటూ కుటుంబసభ్యులకు పరిచయం చేస్తాడు. రాజకుటుంబీలకు దీన్ని ఏ మాత్రం సహించలేరు. ఓ అనాథ అమ్మాయి అయిన నందినీని వారుపట్టపు మహారాణిగా ఊహించుకోలేకపోతారు. దీంతో అక్కడి నుంచి నందినీని వెల్లగొడతారు రాజకుటీంబీకులు. ఈ విషయం కరికాలుడుకి తెలియదు. నందినీని విపరీతంగా ప్రేమించిన కరికాలుడు పిచ్చివాడైపోతాడు. మదమెక్కిన ఏనుగులా రాజ్యవిస్తరణ కోసం దండయాత్రలు సాగిస్తూ చోళుల విజయపరంపరను కొనసాగిస్తుంటాడు. మరోవైపు నందినీ చోళ రాజులపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. చోళులకు వ్యతిరేకులైన పాండ్యుల పక్షాన నిలబడుతుంది. తన పగలో భాగంగా తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన కడంబూర్ రాజు, చోళుల సైన్యాధికారి పెరియా పల వెట్టయార్ (ఆర్. శరత్‌కుమార్)ను వివాహంచేసుకుంటుంది నందిని. అక్కడి నుంచే రాజకుట్రలు చేస్తుం టుంది. ఈ విషయం కరికాలుడు, అరున్‌మోళి వర్మన్, కుందవైలకు తెలుసు. ఇదిలా ఉండగానే సుందరచోళుడు సహోద రుడు కుమారుడు మధురాంతకుడు రాజు కావాలని ఆశపడతాడు. ఇందుకు పెరియా పల వెట్టయార్,కొందరు సామంతరాజుల అండదండలు ఉంటాయి.
రాజ్యవిస్తరణలో భాగంగా రాష్ట్రకూటులపై విజయం సాధించిన ఆదిత్యకరికాలుడు తంజావూర్‌కు వెళ్లడానికి నిరకారిస్తుంటాడు. అక్కడికి వెళితే నందినీ జ్ఞాపకాలు తనను వేధిస్తుంటాయని అతని అవేదన. మరోవైపు నందినీ చేసే కుట్రల వల్ల (ప్యాండుల సహకారంతో..) లంకలో ఉన్న అరుళ్‌మోణి వర్మ ప్రాణానికి హాని ఉందని గ్రహించిన కరికాలుడు అరుళ్‌మోణిని క్షేమంగా తీసుకుని వచ్చే బాధ్యతను చోళ సామ్రాజ్య సా మంత రాజైన వంద్యదేవన్(కార్తి)కు అప్పగిస్తాడు కరికాలుడు. ఈ బాధ్యతను తీసుకున్న వంద్యదేవన్‌లంకకు బయలుదేరతాడు. అయితే ఈ ప్రయాణంలో కండంబూరు కోటలో ఏదో కుట్రజరుగుతుందని తెలుసుకున్న కార్తీ అక్కడికి వెళ్తాడు. ఆదిత్యకరికాలుడికి కాకుండ మ«ధురాంతకుడికి చోళయువరాజు పట్టం కట్టడానికి కొంతమంది సామంతరాజులు జట్టుకట్టి కుట్ర చేస్తున్నట్లు గ్రహిస్తాడు. ఈ విషయాన్ని చోళయువరాణి కుందవైకి చేరవేసి, ఆ తర్వాత లంకకు బయలుదేరి అరున్ మోళిని కలుసుకుంటాడు వంద్యదేవన్. అరుణ్‌మోళి, వంద్యదేవన్‌లపై పాండ్యులు దాడి చేస్తారు. ఈ దాడిలో అరుళ్‌మోళి, వంద్యదేవన్ చనిపోయినట్లుగా తంజావూర్‌కు వార్త వెళ్తుంది. నందినీ సంతోషిస్తుంది. నందినీ చేసే కుట్రల వల్లే తన సహోదరుడుఅరుణ్‌మోళి చనిపోయాడని ఆదిత్యకరికాలుడు భావించి తంజావూర్‌కుబయలుదేరతాడు. కానీ అరుణ్‌మోళిని వృద్దు రాలైన మందాకిని అరుణ్‌మోళిని కాపాడుతుంది. అయితే మందాకిని ఎవరో కాదు నందిని తల్లి. కూతరు నందిని పగ తీర్చుకుంటుంటే ఆమె తల్లి మందాకిని చోళ యువరాజును కాప డటం ఏంటి? సందురచోళుడుకి, మందాకినికి ఏమైనా సంబంధం ఉందా? జ్యోతిష్కులు చెప్పినట్లు ఆకాశంలో ఉద్భువించిన తోకచుక్క చోళకులంలో ఎవర్రీ బలి తీసుకుంటుంది? చోళలపై నందినీ అంతగా పగ పట్టడానికి కారణం వెనుక ఆదిత్యకరికాలుడి ప్రేమే కారణమా? లేక మరి ఏదైనా ఉందా? అనే సందేహాలతో తొలిపార్టు ముగుస్తుంది.
పొన్నియిన్ సెల్వన్ రెండోపార్టు విషయానికి వస్తే…
లంకలో అరుణ్‌మోళి క్షేమంగానే ఉన్నాడని నందనీకి తెలుస్తుంది. ఆదిత్యకరికాలుడు, కుందవైలకు కూడా ఈ విషయం వందే దేవుడు ద్వారా తెలుస్తుంది. దీంతో సుందరచోళుడు, అరుణ్‌మోళి, ఆదిత్యకరికాలుడు..ఈ ముగ్గుర్నీ పౌర్ణమిరోజున ఒకేసారి చంపాలని పాండ్యులతో కలిసి నందినీ వ్యూహరచన చేస్తుంది. నాగపట్నంలోని చూడమణి విహారంలో ఆనారోగ్యం నుంచి కోలుకుంటున్న అరుణ్‌మోళిని చంపేందుకు పాండ్య ఆగంతకులను పంపిస్తుంది నందినీ. ఆదిత్యకరికాలుడిని చంపేందుకు కడంబూరుకి ఆహ్వానిస్తుంది నందినీ. సుందరచోళుడిని చంపేందుకు తంజావూరు రాజమహాల్‌లో పాండ్య ఆగంతకులు కొందరు చోరబడతారు.కానీ అరుళ్‌మోళి తప్పించుకుంటాడు. సుందరచోళుడుని మందాకిని రక్షిస్తుంది. కానీ తన ప్రాణానికి హాని ఉందని తెలిసినా కూడా కడంబూరుకు వెళ్లి ఆదిత్యకరికాలుడు చనిపోతాడు. జ్యోతిష్కులు చెప్పినట్లుగాఆకాశంలో ఉద్భవించిన తోక చుక్క చోళకులంలో ఆదిత్యకరికాలుడుని బలి తీసుకుందని చెప్తాడు దర్శకుడు.తాను ఎంతో ప్రేమించిన ఆదిత్య కరికాలుడు చనిపోయిన తర్వాత పాండ్యుల వద్దకు వచ్చి నందినీ ఎంతోబాధపడుతుంది. ఈ సమయంలో నందినీకి ఓ ఆశ్యకరమైన రహాస్యం తెలుస్తుంది. చోళ సామ్రాజ్యాధిపతిసుందరచోళుడు, పాండ్యారాజు వీరపాండ్యన్(నాజర్), మందాకినిల మధ్య జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కొత్త విషయాలను తెలుసుకున్న నందినీ ఆత్మార్పణం చేసుకుంటుంది. ఈ సంఘటనలు ఇలా ఉండగానే చోళసామ్రాజ్యాన్ని దక్కించుకునేందుకు లంకాధిపతి మహేంద్రుడు సేనను కూడగట్టుకుని రాష్ట్రకూటులు చోళసామ్రాజ్యంపై దండేత్తి వస్తారు. ఈ యుద్ధంలో అరుణ్‌మోళి విజయం సాధిస్తాడు. అయితేనందని తెలుసుకున్న రహాస్యం ఏమిటి? చోళసామ్రాజ్యాన్ని దక్కించుకోవాలని చూసిన మధురాంతకుడు చివరికి ఏమైయ్యాడు? అసలు..వీరపాండ్యయన్‌కు నందనికీ ఉన్న సంబంధం ఏమిటీ? అన్నది సినిమాలో చూడాల్సిందే.
విశ్లేషణ
పొన్నియిన్ సెల్వన్ కథ వార్ అండ్ లవ్ నేపథ్యంలో సాగుతుంది. పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ డ్రామాను రెండు పార్టులుగా తీయాలనుకున్నప్పుడే మణిరత్నం విజయం సాధించారని చెప్పుకోచ్చు.ఒకపార్టుగా తీస్తే ఎన్నో పాత్రలు ఉన్న ఈ డ్రామా విషయంలో ప్రేక్షకులు అయోమయానికి గురి అయ్యేఅవకాశం ఉంది.
ఆదిత్యకరికాలుడు, అరుణ్‌మోళి, వందేదేవుడు, నందినీ, కుందవై, సుందరచోళుడు, మధురాంతకుడు, పెరియా పల వెట్టయార్..వంటి కీలక పాత్రల పరిచయం తొలిపార్టులో ఉంటుంది. ఆదిత్య కరికాలుడు,నందినీల మధ్య ఉన్న ప్రేమ తాలుకూ టీజర్, మధురాంతకుడు రాజు కావడానికి జరుగుతున్న కుట్రలు, వీటిని అడ్డుకోవడానికి కుందవై వేసే పైఎత్తులు, వందేదేవుడు అల్లరి, గూఢచారిగా వందేదేవుడు చేసేపనులు, లంకలో శత్రువులపై అరుణ్‌మోళి, వందేదేవుడు సాహాసాల నేపథ్యంలో తొలిపార్టు ముగుస్తుంది.
మలిపార్టులోనే అసలు డ్రామా అంతమొదలు అవుతుంది. అయితే ఆడియన్స్‌కు ఏ మాత్రం కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు మణిరత్నం స్లో నరేషన్‌కు ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. సెకండ్‌పార్టులో విక్రమ్,నందినీల మధ్య వచ్చే సన్నివేశాలు, ప్రీ ఇంట్రవెల్‌లో నాటపట్టణంలో పాండ్యా ఆగంతుల నుంచి అరుణ్‌మోళి తప్పించుకునే సీన్స్, క్లైమాక్స్‌లో వార్ సీన్స్‌లలో మణిరత్నం మార్క్ కనిపిస్తుంది. ఆడియన్స్‌నుఅలరిస్తుంది. కానీ సందరచోళుడు, మందాకిని, వీరపాండ్యయన్‌ల మధ్య ఉన్న రిలేషన్ తాలకూ సీన్స్‌నుఏ మాత్రం చూపించలేదు మణిరత్నం. అసలు..వీరపాండ్యయన్, మందాకినిల మధ్య ఉన్న ఒక్కసీన్ కూడాసినిమాలో ఉండదు. అలాగే ఆదిత్య కరికాలుడు చనిపోయినప్పుడు కడంబూరు కోట నుంచి నందినీని పాండ్య ఆగంతకులు తప్పిస్తారు. ఓ రాజు హాత్య జరిగినప్పుడు ఆగంతకులు అంత సులభంగా ఎలాతప్పించుకుంటారు? అలాగే తంజావూర్‌లోని రాజమందిరంలోకి పాండ్య అగంతకులు సలభంగా వెళ్తారు.
ఇలాంటి కొన్ని మైనస్‌లు లేవనుకుంటే ‘పొన్నియిన్ సెల్వన్’ క్లాసిక్ చిత్రమే.
నటన
ఆదిత్యకరికాలుడుగా విక్రమ్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. విహారవేధనతో, ఏదో తప్పుచేసిన వ్యక్తి పడే పశ్చాత్తాపం పాత్రలో విక్రమ్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా సెకండ్‌పార్ట్ సెకండాఫ్‌లో వచ్చే ఐశ్వర్యారాయ్, విక్రమ్‌ల మధ్య సన్నివేశాల్లో…విక్రమ్ ప్రతిభ మరోసారి కనబడుతుంది. అరుణ్‌మోళిగా ‘జయం’ రవి మేజర్ మార్కలే దక్కించుకున్నారు. ఫస్ట్‌పార్టు, రెండోపార్టులోని వార్ యాక్షన్ సీక్వెన్స్, కొన్ని ఎమోషనల్, లవ్ సీన్స్‌లో బాగానే యాక్ట్ చేశాడు. పాత్రలో ఉన్న కొద్దిపాటిహ్యూమర్‌ను అవసరమైనప్పుడు పండించాడు. తొలిపార్టులో అల్లరి, గూఢచారి, రక్షకుడిగా సాగిన కార్తీ, రెండో పార్టులో మాత్రం ఎమోషనల్‌గానూ అదరగొట్టాడు. ఇక తొలిపార్టులో త్రిషకు దక్కిన స్క్రీన్ స్పేస్ రెండోపార్టులో లేదు. నందిని, మందాకిని పాత్రల్లో ఐశ్వర్యారాయ్ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణ. పాండ్య రాజు వీరపాండ్యయన్ చనిపోయినప్పుడు, సెకండ్‌పార్టు సెకండాఫ్‌లో విక్రమ్‌తో సీన్స్, కడంబూరులో వ్యూహరచన, త్రిషతో పోటాపోటీ డైలాగ్స్…ఇలా ఐశ్వర్యారాయ్ ప్రతిసీన్‌లోనూ అదుర్స్ అనిపించారు. సేమ్ టైమ్‌మందాకినిగా ఐశ్వర్యారాయ్‌కు పెద్ద యాక్టింగ్ స్కోప్ లేదు. అరుణ్‌మోళికి కాబోయే భార్యగా వానతిగా శోభితా ధూళిపాళ్ల.అరుణ్‌మోళికి సహాయం చేసే సముద్రకుమారిగా ఐశ్వర్యలక్ష్మీ ఫర్వాలేదనిపించారు.ఇక సుందరచోళుడిగా ప్రకాశ్‌రాజ్, ఆర్.శరత్‌కుమార్, ప్రభు, గూఢచారిగా జయరాం వారి వారి పాత్రల మేరకు మెప్పించారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం, తోటరమణి ఆర్ట్‌వర్క్, రవివర్మన్ సినిమాటోగ్రఫీ పెద్ద ఎస్సెట్స్.
-
బలాలు
-
తొలిపార్టులో
క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు
కార్తీ, త్రిష సీన్స్
విక్రమ్, ఐశ్వర్య సీన్స్ - రెండోపార్టులో…
విక్రమ్, ఐశ్వర్యారాయ్ సీన్స్
క్లైమాక్స్ వార్ సీక్వెన్స్
ఇంట్రవేల్ బ్యాంగ్ -
బలహీనతలు
కథనం చాలా నెమ్మదిగా నడవడం
కథలోని ట్విస్ట్‌లు, మలుపు తిప్పే పాత్రచిత్రీరణ సరిగా ఎస్టాబ్లిష్ కాకపోవడం
కొన్ని సీన్స్ సాగతీతగా ఉండటం
ఫైనల్: పొన్నియిన్ సెల్వన్ మెప్పిస్తాడు (ఒప్పిగ్గా..అర్థం చేసుకుంటూ చూస్తే…)(2.75/5)
Akhil Agent Review: అఖిల్ ఏజెంట్ మూవీ రివ్యూ