Nagachaitanya Custody: ‘కస్టడీ’ సినిమా రిజల్ట్ పై నాగచైతన్య ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున ‘ఘోస్ట్’, అఖిల్ ‘ఏజెంట్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో అందరి చూపు ఈనెల 12న విడుదల కానున్న నాగచైతన్య(Nagachaitanya) ‘కస్టడీ’ పైనే ఉన్నాయి. ఇటు నాగచైతన్య హీరోగా నటించిన గత చిత్రం‘థ్యాంక్యూ’, కీలక పాత్రలో నటించిన హిందీ చిత్రం ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రాలు తెలుగులో డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ తరుణంలో నాగచైతన్య నుంచి వస్తున్న ఈ లేటెస్ట్ ఫిల్మ్ ‘కస్టడీ’ విజయం అతనికెరీర్కు ఎంతో ఇంపార్టెంట్. మరి..ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలంటే మరో రెండువారాలు వెయిట్ చేస్తే సరిపోతుంది.
ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కస్టడీ’. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి అమరేన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వ నాథ్, కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాత. తెలుగు, తమిళం భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల అవుతుంది. మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కస్టడీ సినిమాకు సంయుక్తంగా స్వరాలు అందించారు.