బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ కొడుకు ఆర్యన్‌ఖాన్ (Aryankhan) రైటర్‌గా, దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన తండ్రి షారుక్‌ఖాన్ నటించగా,ఓ యాడ్ఫిల్మ్ను డైరెక్ట్ చేసాడు ఆర్యన్‌ఖాన్. అయితే ఎప్పట్నుంచో షారుక్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ దర్శకుడిగా ఓ వెబ్‌సిరీస్ రూపొందనుందనివార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని షారుక్‌ఖాన్ కూడా ఓ సందర్భంగా వెల్లడించారు.అయితే ఇప్పుడు అది నిజమైంది.
అవును..ఆర్యన్‌ఖాన్ డైరెక్షన్లో ‘స్టార్డమ్’(Stardom) అనే వెబ్‌సిరీస్ రూపొందనుంది. షారుక్‌ఖాన్ నిర్మాణసంస్థ రెడ్‌చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించనుంది. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీఆధారంగా ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కనుందని బాలీవుడ్ సమాచారం. మొత్తం ఆరు ఏపిసోడ్స్‌గా ఈ ‘స్టార్డమ్’ వెబ్‌సిరీస్ వ్యూయర్స్ ముందుకు రానుంది. అయితే ఈ వెబ్‌సిరీస్‌లో ఎవరూ యాక్ట్ చేస్తారు?అనే విషయంపై మాత్రం వివరాలు ఇంకా రావాల్సి ఉంది.