సాయిధరమ్‌తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’ సినిమా సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచింది. కార్తీక్ దండు దర్శకత్వంలో సంయుక్తామీనన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ఇది. సుకుమార్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ హారర్ ఫిల్మ్‌ఏప్రిల్ 21న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. యూఎస్‌లో వన్‌మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. కేవలం తెలుగులో విడుదల చేయబడిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 50 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను ఈ చిత్రం రాబట్టింది.త్వరలోనే ఈ సినిమాను మిగతా భాషల్లో విడుదల చేయాలని చిత్రంయూనిట్ ఏర్పాట్లు చేస్తుంది. మే 5న రిలీజ్ చేయే యోచనలో ఉన్నారు చిత్రంయూనిట్.
అయితే ఈ సమయంలో సాయిధరమ్‌తేజ్ యాక్సిడెంట్ ఏపిసోడ్ తెరపైకి వచ్చింది. 2021 సెప్టెంబరులో సాయిథరమ్‌తేజ్‌కు యాక్సిడెంట్ అయ్యి దాదాపు 22 రోజుల కోమాలోనే ఉండిపోయారు. అయితే సాయిధరమ్‌తేజ్‌కు యాక్సిడెంట్ అయినసమయంలో అతన్నీ కాపాడి, ప్రాథమిక చికిత్స అందించి, హాస్పిటల్‌కు, అంబులెన్స్‌కు ఇన్ఫార్మ్ చేసింది అబ్దుల్ ఫర్హాన్. ఈ సమయంలో సాయి ధరమ్‌తేజ్ ప్రాణాలను పరోక్షండా కాపాడింది అబ్దుల్ ఫర్హాన్ అనే చెప్పవచ్చు.
సాయితేజ్ బతికాడు. అయితే ఇందుకు గాను అబ్ధుల్ ఫర్హాన్‌కు పెద్ద మొత్తంలో మెగా ఫ్యామిలీ నుంచి డబ్బులు ముట్టాయనే ప్రచారం జరిగింది. కానీ తనకు మెగాఫ్యామిలీ నుంచి ఏ ఆర్థిక సహాయం అందలేదని, సాయితేజ్ తనను కనీసం కలవలేదని, సాయితేజ్ ఫోన్ నెంబర్ కూడా తనవద్ద లేదని తాజాగా అబ్ధుల్ ఫర్హాన్ పేర్కొన్నారు. అంతేకాదు..మెగాఫ్యామిలీ నుంచి తనకు ఏదో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినట్లుగా ప్రచారం జరగడంతో వ్యక్తిగతంగా తాను ఇబ్బందులు
ఎదుర్కొవలసి వచ్చిందని, ఈ ఫ్రస్ట్రేషన్‌లో ఉద్యోగం కూడా కోల్పోయాని, ప్రస్తుతం నాలుగు నెలలుగా ఖాళీగానే ఉంటునానని అబ్దుల్ ఫర్హాన్ చెప్పుకొచ్చారు.
అయితే ఈ విషయంపై సాయితేజ్ స్పందించారు. తన ప్రాణాలు కాపడానిన అబ్దుల్ ఫర్హాన్ మానవత్వాన్ని తాను డబ్బులతో కొలవలేనని, అతనికి ఏదైనా సహాయం కావాలంటే మాత్రం ఇందుకు అనుగుణంగా ఫర్హాన్ మమ్మల్నీ సంప్రదించేలా నా మేనేజర్ అతనితో కాంటాక్ట్‌లో ఉన్నాడని ఓ నోట్‌ను విడుదల చేశారు. అలాగే ఈ విషయంపై మరోసారి తాను మాట్లాడనని కూడా సాయితేజ్ వెల్లడించారు.
To whomsoever it may concern..
Thank You
Sai Dharam Tej. pic.twitter.com/qJr3SYYJ6B
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 27, 2023
యాక్సిడెంట్ జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్న ఈ సమయంలో అదీ కూడా సాయిధరమ్‌తేజ్ ‘విరూపాక్ష’ సక్సెస్‌ను ఏంజాయ్ చేస్తున్న టైమ్‌లో ఇలాంటి ప్రస్తావన రావడం అనేది ఎవరో కావాలని చేసిన వివాదమన్నట్లుగా సాయితేజ్ ఫ్యాన్స్, కొందరు మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సాయితేజ్ విరూపాక్ష విజయాన్ని ఒర్వలేక కొందరు కావాలనే అనుకూల మీడియా ద్వారా ఇలా చేస్తు న్నారని సాయితేజ్ వర్గీయులు భావిస్తున్నారట.