Maheshbabu GunturKaaram Review: హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ సినిమా సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఖలేజా’ సినిమా థియేటర్స్‌లో సరిగ్గా ఆడలేదు. కానీ టెలివిజన్‌లో బాగానే చూస్తున్నారు. ఈ సినిమాలో సరికొత్త మహేశ్‌ను చూపించారు త్రివిక్రమ్. ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపు పధ్నాలుగు సంవత్సరాల తర్వాత ‘గుంటూకారం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోగా మహేశ్‌కు, దర్శకుడిగా త్రివిక్రమ్‌కు ఇమేజ్ బాగా పెరిగిన తర్వాత వచ్చిన చిత్రం ఇది. పైగా సంక్రాంతి సమయంలో విడుదలకు సిద్ధ మైంది. దీంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి..ఆ అంచనాలను ‘గుంటూరుకారం’ అందుకుందా? రివ్యూ(Maheshbabu GunturKaaram Review) లో చదివేద్దాం.
సినిమా: గుంటూరుకారం
ప్రధాన తారాగణం: మహేశ్‌బాబు, శ్రీలీల, జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్
దర్శకుడు: త్రివిక్రమ్
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
సంగీతం: తమన్
కథ
జనదళం పార్టీ నాయకుడు వైరా వెంకటస్వామి(ప్రకాష్‌రాజ్) కుమార్తె వైరా వసుంధర (రమ్యకృష్ణ). భోగినేని సత్యానారాయణ(మలయాళ నటుడు జయరాం)ను కులాంతర వివాహం చేసుకుంటుంది వసుంధర. సత్యనారాయణ, వసుంధరల కుమారుడు భోగినేని వీరవెంకట రమణ (మహేశ్‌బాబు). గుంటూరులో కనకదుర్గ మిర్చి యార్డులో వ్యాపారం చేస్తుంటాడు సత్యానారాయణ. అతని చెల్లెలు బుజ్జి (ఈశ్వరీ రావు). వీరవెంకట రమణకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు.. ఓ రోజు మార్క్(జగపతిబాబు) వచ్చి కనకదుర్గ మిర్చి యార్డును పేల్చేస్తాడు. ఈ మంటల్లో వెంకట రమణ కన్నుకు గాయం అవుతుంది. ఈ గోడవల్లోనే మార్క్ (జగపతిబాబు) బ్రదర్ లెనిన్ (సునీల్) మెడకు సత్యనారాయణ తమ్ముడు బాబ్జీ (రఘుబాబు) కత్తి బలంగా తాకుతుంది. దీంతో లెనిన్ చనిపోతాడు. కోర్టు కేసు నడుస్తున్నప్పుడు లెనిన్‌ను చంపింది తన భర్త సత్యానారాయణ అని చెబుతుంది వసుంధర. అలాగే తండ్రి వైరా వెంకటస్వామి దగ్గరకు వెళ్లి, అతను చెప్పినట్లుగా వారి కులానికే చెందిన పక్కా నారాయణ(రావు రమేష్)ను రెండో వివాహం చేసుకుంటుంది వసుంధర. ఆమెకు రెండో కొడుకు రాజ గోపాల్(రాహుల్ రవీంద్రన్). వసుంధరను రాజకీయాల్లోకి తీసుకువచ్చి న్యాయశాఖ మంత్రిగా చేస్తాడు వెంకటస్వామి.
అయితే తమ ఆస్తి, రాజకీయవారసత్వానికి వెంకటరమణ అడ్డు రాకూడదని వెంకటస్వామి భావించి, వెంకటరమణ నుంచి చట్టపరంగా సంతకం చేయమంటాడు. ఇరవై సంవత్సరాలు తల్లికి దూరంగా ఉంటున్న వెంకటరమణ ఈ సాకుతో తల్లి వసుంధరకు దగ్గర కావాలనుకుంటాడు. ఈ ప్రయత్నాల్లో అముక్త మాల్యద(శ్రీలీల)ను ఇష్టపడతాడు. మరి…తల్లికి వెంకటరమణ ఏ విధంగా దగ్గర అవుతాడు? అడ్డుగా ఉన్న వెంకట స్వామి ఏం చేస్తాడు? అసలు..వెంకటరమణకు వసుంధర ఎందుకు దూరం అయ్యింది? అముక్తతో వెంకట రమణ లవ్ ఏమి అవుతుంది? న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వసుంధరకు దాస్(అజయ్ ఘోష్), కాటా మధు(శివ శంకర్)లతో వచ్చే ఇబ్బందులే ఏమిటి? అనేది మిగతా కంథాంశం.
విశ్లేషణ
తల్లికి దగ్గరవ్వాలనుకునే ఓ కొడుకు కథే ‘గుంటూరు కారం’. కొడుకు గుంటూరులో మిర్చి వ్యాపారం. తల్లి హైదరాబాద్‌లో న్యాయశాఖ మినిస్టర్. తల్లిని కలవడం కోసం సంతకం సాకుతో మూడురోజులకోక సారి హైదరాబాద్ వెళ్లిస్తుంటాడు హీరో. మధ్యలో హీరోయిన్స్‌తో అవసరంలేని రొమాన్స్. దీన్నే తిప్పి తిప్పి చూపిస్తాడు దర్శకుడు. పాతిక సంవత్సరాల క్రితం కనకదుర్గ మిర్చియార్డ్‌లో జరిగే ప్రమాదంతో కథ మొదలవుతుంది. హీరో పాత్ర యాటిట్యూడ్, మిగతా పాత్రల పరిచయాలు, అముక్తతో హీరో రొమాంటిక్ లవ్‌స్టోరీ(సంగం గుంటూరులో, సగం హైదరాబాద్‌లో)తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ధమ్ మాసాల సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సీన్ తప్ప సినిమాలో ఒక్క హై మూమెంట్ కూడా ఉండదు. హీరో సంతకం పెట్టడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. తల్లికి యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి మళ్లీ గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తాడు హీరో. ఈ క్రమంలో ప్రజాతంత్ర పార్టీ నాయకుడు మధు, హరి దాస్‌ల కథలు, హరిదాస్ లొకేషన్లో ఫైట్, కుర్చిని మడతపెట్టేసాంగ్తో క్లైమాక్స్ వరకూ వచ్చేస్తుంది. సినిమా.
కుర్చీని మడతపెట్టినట్లే కథను మడతపెట్టేశాడు దర్శకుడు. తల్లి కొడుకుల ఎమోషన్ మెయిన్ కథ అనుకుంటే అదీ లేదు. తల్లి కొడుకుల ఎమోషన్ కంటే తండ్రీకొడుకుల ఎమోషనే ఎక్కువగా సినిమాలో కనిపిస్తుంది. ఫస్టాఫ్ పర్వాలేదు. సెకండాఫ్ ఇంకా బాగుంటుందని ఆశిస్తే ఆడియన్స్ కళ్లలో గుంటూరుకారమే. తండ్రిని ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్న కూతురు, మళ్లీ తండ్రికి భయపడి రెండో పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుందనుకున్నారో ఓ పట్టాన అర్థం కాదు. 150 కోట్లకు పైగా బడ్జెట్ అంటున్నారు. కానీ ఆ ఖర్చు స్క్రీన్ మీద అయితే లేదు. ఖాళీ రోడ్లు, రెండు ఇళ్లు తప్ప కథలో ఏమి లేదు. మ్యూజిక్, ఆర్ఆర్ కూడా అంతగా బాగుండవు. థియేటర్స్ నుంచి ఆడియన్స్ ఊసురుమనుకుంటూ రావడమే. వస్తూ వస్తూ కొన్ని ప్రాస డైలాగ్స్ గుర్తుకు తెచ్చుకోవడమే.కొంతకాలంగా స్క్రీన్‌పై ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉంటున్నాడు మహేశ్. కానీ ఈ సినిమాలో డైలాగ్స్ చెప్పే సమయంలో తప్పితే..అదీ కూడా కొంచమే..మిగతా అన్నీ సన్నివేశాల్లో మహేశ్ నోట్లో బిడీ ఉంటుంది. ఫస్టాఫ్‌లోని మేజర్ సన్నివేశాల్లో మహేశ్ చేతిలో మందు గ్లాస్ ఉంటుంది. హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిస్ చేసిన తర్వాత కూడా మహేశ్ చేతిలో బిడీ, మందుగ్లాస్
ఉండటం కాస్త ఆడియన్స్‌కు ఇబ్బంది కరంగానే ఉండొచ్చు.
ఎవరు ఎలా చేశారంటే…
యాక్టింగ్ పరంగా చూసుకుంటే మహేశ్ బాగా చేశాడు. ఆ స్వాగ్, ఆ స్టైల్, ఆ డైలాగ్ డెలివరీ బాగుంటాయి. డ్యాన్స్‌లో కూడా మునపటి కంటే మెరుగైయ్యాడు ప్రిన్స్. శ్రీలీల డ్యాన్స్‌ల పరంగా సూపర్. యాక్టింగ్‌కు పెద్ద స్కోప్ లేదు. మరో హీరోయిన్ మీనాక్షీకి టీ,కాఫీలు అందించడమే ఈ సినిమాలో పని. సో..యాక్టింగ్ చేయడానికి ఏమీ లేదు. విలన్‌గా ప్రకాష్‌రాజ్ బాగా చేశారు. భరత్ అనే నేను గుర్తుకు వస్తుంది. రావు రమేష్, జగపతిబాబు వంటి బలమైన నటులు స్క్రీన్ పైన ఉన్నా కథలో వారి పాత్రలకు బలం లేదు. అప్పు డప్పుడు కనిపిస్తారు. లాయర్ సారాంగపానిగా మురళీ వర్మ, అసిస్టెంట్ లాయర్ బాలసుబ్రహ్మణ్యంగా వెన్నెల కిశోర్ యాక్టింగ్ చేసే ప్రయత్నం చేశారు. చెప్పుకోదగ్గ స్థాయిలో తమన్ సంగీతం ఇవ్వలేదు. ఆర్ఆర్ కూడా గుర్తుండిపోయేలా ఏమి ఉండదు. నిర్మాణ విలువలు ఒకే. ఎడిటర్ నవీన్నూలి కట్ చేయాల్సింది చాలా ఉందెమో అనిపిస్తుంది.
బలాలు
మహేశ్‌బాబు నటన
బలహీనతలు
పేలవమైన స్టోరీ
అనవరసరమైన లవ్‌ట్రాక్, సాంగ్స్
బలవంతపు కామెడీ
ఫైనల్‌గా…ఆడియన్స్ కంట్లో గుంటూరుకారం (2.25/5)
zoyemi