Maheshbabu: మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి ‘ఎస్ఎస్ఎమ్బీ28’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన అతడు సూపర్‌హిట్‌గా నిలవగా, ‘ఖలేజా’కు థియేటర్స్‌లో అంతగా ఆదరణ దక్కలేదు. కాగా ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లోని సినిమాను నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. కాగా ఈ సినిమాను 2024 జనవరి 13న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మార్చి 26, 2023న ప్రకటించారు మేకర్స్. అలాగే ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.
ఈ ఫస్ట్‌లుక్ మహేశ్‌బాబు సిగరెట్ పట్టుకుని ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే మహేశ్‌బాబు సిగరేట్ పట్టుకుని ఉన్న ఫస్ట్‌లుక్ క్యారెక్టరైజేషన్‌ను చివరిసారిగా 2007లో వచ్చిన ‘అతిథి’ సినిమాలో చూశాం. మళ్లీఅంటే 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో చూస్తున్నాం. అంటే మహేశ్ సిగరేట్ పట్టుకుని ఉన్నస్టిల్ రావడానికి 16 సంవత్సరాలు పట్టింది. గతంలో ‘టక్కరిదొంగ’, ‘ఒక్కడు’, ‘పోకిరి’ వంటి సినిమాల్లో మహేశ్ పొగ పీల్చారు.
నిజానికి కెరీర్ స్టార్టింగ్‌లో మహేశ్ బాగా సిగరేట్లు కాల్చేవారట. ఓ సందర్భంలో ఆయన సన్నిహితుడు ఒకరు అలెన్కార్ రాసిన ఓబుక్ను గిప్ట్గా ఇవ్వగా, చదివి అప్పట్నుంచి సిగరెట్లు ఎక్కువగా కాల్చడం మానేశారట Mahesh.
M. M. Keeravani: నాటు నాటు నాకు రెండో ఆస్కార్ అవార్డు….రామ్‌గోపాల్‌వర్మ నా ఫెవరెట్
మహేశ్‌బాబు నెక్ట్స్ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో రూపొందనుంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరెస్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ఈ చిత్రం షూటింగ్ 20 24లో మొదలు కానుంది.