M. M. Keeravani: కెరీర్‌లో తాను సాధించిన తొలి ఆస్కార్ రామ్‌గోపాల్‌వర్మ ఇచ్చిన అవకాశమేనని అంటున్నారు సంగీత దర్శకులు–లిరిసిస్ట్, రైటర్ ఎమ్‌ఎమ్ కీరవాణి. ఇటీవల అమెరికాలో జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో బెస్ట్‌ఒరిజినల్ సాంగ్ విభాగంలో లిరిసిస్ట్ చంద్రబోస్‌తో కలిసి కీరవాణి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతితెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ పాటను రాహుల్‌సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రాఫర్. అయితే ‘ఆస్కార్ అవార్డు’ సాధించిన తర్వాత ఈ విషయంపైకీరవాణి మాట్లాడారు.
‘‘దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘శివ’తోనే పాత్‌బ్రేకింగ్ హిట్ సాధించి మంచి జోష్‌లో ఉన్నారు రామ్‌గోపాల్‌వర్మ. ఆ సమయంలో నేను అవకాశాల కోసం చూస్తున్నాను. అప్పుడు రామ్‌గోపాల్‌వర్మగారు ‘క్షణక్షణం’ సినిమాకు అవకాశం ఇచ్చారు. ‘ఎవరో కీరవాణి అంటా..రామ్‌గోపాల్‌వర్మ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. అతన్నీ వెంటనే మన సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా బుక్ చేసుకుందాం’అంటూ చాలామంది దర్శక–నిర్మాతలు అనుకున్నారు. అలా రామ్‌గోపాల్‌వర్మగారి అసోసియేషన్ నాకెరీర్ ఎదుగుదలకు బాగా హెల్ప్ చేసింది. అందుకే నా కెరీర్‌లో నేను అందుకున్న తొలిఆస్కార్ అవార్డురామ్‌గోపాల్‌వర్మగారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు నేను అందుకున్నది రెండో ఆస్కార్ అవార్డు. ప్రస్తుతం నేను ఆయనతో వర్క్ చేయకపోవచ్చు. కెరీర్ స్టార్టింగ్‌లో మనం వర్క్ చేసిన వారితోఆ తర్వాత మళ్లీ సినిమాలు చేయకపోవడం అనేది ఇండస్ట్రీలో మాములే. ఎదీఏమైనా రామ్‌గోపాల్‌వర్మగారు నాకు చాలా ఇష్టం. ఆయన నా ఫెవరెట్’’ అని చెప్పుకొచ్చారు కీరవాణి.
Hey @mmkeeravaani I am feeling dead because only dead people are praised like this 😢😩😫 pic.twitter.com/u8c9X8kKQk
— Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2023
తనపై కీరవాణి చేసిన వ్యాఖ్యలపై రామ్‌గోపాల్‌వర్మ రెస్పాండ్ అయ్యారు. ‘‘నేను చనిపోయానా?..చనిపోయిన వ్యక్తులనే ఇంతలా పొగుడుతారు’ అంటూ ట్వీట్స్ చేశారు రామ్‌గోపాల్‌వర్మ.