95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో బెస్ట్ ఒరిజినల్‌సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ‘నాటు నాటు’ పాటకు సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్‌లువేదికపై అవార్డులు అందుకున్నారు. ఈ ‘నాటు నాటు’ పాటకు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు మంచి సింక్‌లో అత్యద్భుతంగా డ్యాన్స్ చేశారు. దర్శకుడు రాజమౌళి నేతృత్వంలో కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్‌రక్షిత్, సింగర్స్‌గా రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ కోసం కష్టపడ్డారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో భారతదేశం మురిసిపోయింది. అందులోనూ ప్రతి తెలుగువాడు గర్వంగా ఫీలయ్యార నడంలో ఏం సందేహంలేదు.
ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటకు లైవ్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనుభూతిని వర్ణిస్తూ ఇటీవల కాలభైరవ సోషల్‌మీడియాలో ఓ నోట్‌ను షేర్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఈ నోట్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ పేర్లను మర్చిపోవడంతో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కాలభైరవపై కోపడ్డారు. దీంతోకాలభైరవ పరోక్షంగా క్షమపణలు చెప్పాల్సి వచ్చింది.
I have no doubt Tarak anna and Charan anna are the reason for the success of naatu naatu and RRR itself.
I was ONLY talking about who all helped me get my opportunity for the academy stage performance. Nothing else.
I can see that it was conveyed wrongly and for that, I… https://t.co/U3B4PdbDBM
— Kaala Bhairava (@kaalabhairava7) March 17, 2023
కాలభైరవ ఎపిసోడ్‌ను పూర్తిగా అందరూ మర్చిపోకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌కీరవాణి ఇటీవల ఓ తమిళ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘‘అవార్డులు వచ్చేంత గొప్ప విషయాలు ఏవీ ‘నాటు నాటు’లో లేవు. ఈ పాట పక్కా కమర్షియల్ సాంగ్. దర్శకుడు రాజమౌళి విజన్, ప్రేమ్‌రక్షిత్‌కొరియోగ్రఫీలకు తోడు చంద్రబోస్ ‘నాటు నాటు వీర నాటు…నాటు నాటు ఊర నాటు’ అనే హుక్‌లైన్స్ వల్ల ఈ పాట ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ‘నాటు నాటు’ స్టెప్స్ వైరల్ అయ్యాయి. ఇవన్నీ అవార్డులు వచ్చేలా చేశాయి. మేజర్ క్రెడిట్ అంతా రాజమౌళి, ప్రేమ్‌రక్షిత్, చంద్ర బోస్‌లకు దక్కుతుంది. ఆస్కార్ అవార్డును గురించి నేను ఆలోచించడం పక్కన పెడితే…అసలు ‘నాటు నాటు’ పాటకు అవార్డులు వస్తాయని నేనస్సలు ఊహించలేదు’’ అని చెప్పుకొచ్చారు కీరవాణి.
Jai Hind 🇮🇳
— rajamouli ss (@ssrajamouli) March 13, 2023
Dearest JANANEE…🇮🇳
Your support made us cross the Atlantic WATERs , keep the FIRE alive within – and create hiSTORY. RRR means the world to me . But for now it means Return home , Receive your love and Rejoice !!!
— mmkeeravaani (@mmkeeravaani) March 15, 2023
‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు రాజమౌళి జస్ట్ ‘జైహింద్’ అని ట్వీట్ చేశారు. కీరవాణి కూడ ట్వీట్ చేశారు. కానీ ఎన్టీఆర్, రామ్‌చరణ్ పేర్లు లేవు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టులో కూడా రాజమౌళి మీడియాతో మాట్లాడకుండ జైహింద్ అంటూ వెళ్లిపోయారు కానీ ‘నాటు నాటు’ గురించి మాట్లాడి ఎన్టీఆర్, రామ్‌చరణ్ పేర్లను ప్రస్తావించలేదు. కానీ రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు మాత్రం దేశానికి తిరిగి రాగానే రాజమౌళి, చంద్రబోస్, కీరవాణి, ప్రేమ్‌రక్షిత్, కాలభైరవ, రాహుల్‌సిప్లిగంజ్‌లను పొగిడారు.
ఆ ఇంటర్వ్యూలో ‘నాటు నాటు’ ప్రస్తావన వచ్చినప్పుడు కీరవాణి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పేర్లను పెద్దగా ప్రస్తావించలేదు. దీంతో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు మేజర్ క్రెడిట్ ఇవ్వకపోయినా కనీసం పేర్లయినా చెప్పండి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచ వేదికపై తెలుగు సినిమా జెండా…నాటు నాటుకు ఆస్కార్
M. M. Keeravani: నాటు నాటు నాకు రెండో ఆస్కార్ అవార్డు….రామ్‌గోపాల్‌వర్మ నా ఫెవరెట్