‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చరిత్ర సృష్ఠించింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో మార్చి 12న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అ వార్డు దక్కింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు స్వరకర్త అయిన కీర వాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ‘ఆస్కార్ అవార్డును అందుకున్నారు. తెలుగు సినిమా చిరిత్రలో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి తెలుగు సంగీత దర్శకుడిగా కీరవాణి, తొలి లిరిక్ రైటర్‌గా చంద్రబోస్‌లు రికార్డులు సృష్ఠించారు.
ఆస్కార్ అవార్డు సాధించిన ఆసియన్ ఫిల్మ్‌లోని తొలిపాట కూడా ‘నాటు నాటు’యే కావడం విశేషం. అలాగేఇంగ్లీష్ భాషలో కాకుండ ఆస్కార్ అవార్డు సాధించిన మరో భాషకు చెందిన నాలుగో పాట కూడా ‘నాటు నాటు’యే. వీటికితోడు తొలి ఆస్కార్ అవార్డు సాధించిన తొలి ఇండియన్ సినిమా కూడా ‘ఆర్ఆర్ఆర్’యే అద్భుతమైన విశేషం.
ఇక బెస్ట్ ఒరిజినల్‌సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన రెండో భారతీయుడిగా కీరవాణి,రెండో లిరిక్ రైటర్‌గా చంద్రబోస్‌లు రికార్డు సాధించారు. వీరికి ముందు బెస్ట్ఒరిజినల్ సాంగ్ విభాగంలో బ్రిటిష్ ఫిల్మ్ ‘స్లమ్డాగ్మిలియనీర్స్’ సినిమాకుగాను ఏఆర్ రెహామాన్, లిరిక్ రైటర్ గుల్జార్ అవార్డులు అందుకున్నారు. ఇకఅలాగే ‘డాక్యూమెంటరీ షార్ట్ సబ్జెక్ట్’ విభాగంలో ఇండియన్ డాక్యూమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు కొల్లగొల్లగొట్టింది. మరోవైపు డాక్యూమెంటరీ ఫీచర్‌ఫిల్మ్ విభాగంలో అవార్డుకు నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ మాత్రం నిరాశమిగిలింది. ఈ విభాగంలో ‘నావల్నీ’ అవార్డును ఎగరేసుకుపోయింది.
ఆస్కార్ వేడుకలో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం ఏడు అవార్డులను కొల్లగొట్టింది. ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ చిత్రం నాలుగు అవార్డులను దక్కించుకుంది. ‘ది వేల్’ చిత్రం రెండు అవార్డులను గెలుచుకుంది.