ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ ప్రదానోత్సవం ఘనంగా ముగిసింది. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం ఏకంగా ఏడు అవార్డులను ఎగరేసుకుని పోయింది. అంతేకాదు…యాక్టింగ్‌లో ప్రధాన విభాగాలైన బెస్ట్ యాక్ట్రస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్‌తో పాటుగా బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డులు సాధించి ఔరా..అనిపించింది ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్‌ఎట్ వన్స్’ చిత్రం. ఇక తొమ్మిది నామినేషన్లు దక్కించుకున్న జర్మన్ ఫిల్మ్ ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’కు నాలుగు విభాగాల్లో అవార్డులను దక్కించుకోగలింది. ఒక ‘ది వేల్’ చిత్రానికి రెండు అవార్డులు వచ్చాయి. అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు ది వేల్ చిత్రంలోని బ్రెండెన్ ఫ్రాజెర్ యాక్టింగ్‌కు దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక తొమ్మిది నామినేషన్స్ దక్కించుకున్న ‘ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’, ఆరు నామినేషన్స్ దక్కించుకున్న టార మూడు నామినేషన్స్ దక్కించుకున్న బ్యాట్‌మ్యాన్ చిత్రాలకు ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం.






అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం భారతీయకాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం 5గంటలకు మొదలైంది. ఈ వేడుకలో హోస్ట్ జిమ్మి కెమ్మెల్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ను బాలీవుడ్ మూవీగా చెప్పడం అనేది ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహించేలా చేసింది. అయితే వేదికపై ‘నాటు నాటు’ లైవ్ పెర్ఫార్మెన్స్, తర్వాత స్టాండింగ్ ఒవేషన్ వంటివి ఇండియన్ ఫ్యాన్స్‌ను ఖుషి చేశాయనే చెప్పవచ్చు.


బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు గెలిచిన ‘నాటు నాటు’, ‘బెస్ట్ డాక్యూమెంటరీ షార్ట్ సబ్జెక్ట్’లో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు అవార్డులు రావడంతో ఇండియన్ అభిమానులు హ్యాపీ ఫీలయ్యారు. ‘నాటు నాటు’ పాటకు ఈ పాట సంగీత దర్శకుడు కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ తరఫున దర్శకురాలు కార్తికీ, నిర్మాత గునీత్ మోంగ అవార్డ్స్ అందుకున్నారు. కానీ ‘ది డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ఇండియన్ దర్శకుడు శౌనత్‌సేన్ చేసిన ‘ఆల్ దట్ బ్రీత్స్’కు అవార్డు దక్కకపోవడం అనేది ఇండియన్ అభిమానులను కాస్త నిరాశపరిచింది. కానీ ఆస్కార్ చరిత్రలోనే ఒక వేడుకలో ఇండియన్ చిత్రాలకు రెండు ఆస్కార్ అవార్డులు రావడం అనేది మాత్రం సరికొత్త చరిత్రే అని చెప్పవచ్చు.




Kartiki Gonsalves
Guneet Monga
95వ ఆస్కార్ అవార్డుల జాబితా
ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ నటుడు: బ్రెండెన్ ఫ్రాసెర్ (ది వేల్)
ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్)
ఉత్తమ ఒరిజినల్‌సాంగ్ – ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రలలోని ‘నాటు నాటు’(మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్)
ఉత్తమసహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమసహాయ నటి: జామి లీ కర్టిస్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: రూథ్ కార్టర్(బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్)
బెస్ట్ డాక్యూమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్
ఉత్తమ స్క్రీన్ ప్లే: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సినిమాట్రోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్ (జర్మనీ)
ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నవాల్నీ
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్(అవతార్ 2)
బెస్ట్ సౌండ్: టాప్‌గన్:మ్యావరిక్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: ది వేల్
బెస్ట్ యానీమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ :ఏన్ ఐరిస్ గుడ్ బై
యానీమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ది హార్స్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్)