SSMB28: ‘అతడు’(2005), ‘ఖలేజా’(2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రూపొందనుంది 2021 మే 1న ప్రకటించారు. అలాగే 2022 సమ్మర్కురిలీజ్ చేస్తున్నట్లుగా ఆ అనౌన్స్మెంట్ వీడియోలోనే వెల్లడించింది నిర్మాణసంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్. 11 సంవత్సరాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తుండటంతో ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
మహేశ్‌బాబు కెరీర్లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లుగా అయితే మాత్రం సాగలేదు. మొదట త్రివిక్రమ్ చెప్పిన కథ మహేశ్‌కు నచ్చలేదు. కొన్ని మార్పులు సూచించారు మహేశ్. అవి త్రివిక్రమ్‌కు నచ్చలేదు. ఆల్రెడీ ఎన్టీఆర్‌తో సినిమాను కాదనుకుని వచ్చిన త్రివిక్రమ్ మళ్లీమహేశ్ను కూడా కాదనుకోలేని పరిస్థితి. ఎలాగో అలా కొన్ని మార్పులు చేసి అప్పటికే వేకేషన్లో ఉన్న మహేశ్‌కు చెప్పి వచ్చాడు త్రివిక్రమ్. కథ ఒకే అయ్యింది. సెట్స్‌పైకి వెళ్తామనుకున్న సమయంలో మహేశ్అన్నయ్య నటుడు రమేష్‌బాబు 2022 జనవరిలో మరణించారు. అంతే షూటింగ్ నిలిచిపోయింది. ఆ నెక్ట్స్ మహేశ్ జీవితంలో మరో కుదుపు..2022 సెప్టెంబరులో ఆయన తల్లి ఇందిరాదేవీ స్వర్గస్తులైయ్యారు. ఈ రెండు విషాదాల నుంచి కోలుకునేలోపే మరో పెనువిషాదం మహేశ్ జీవితాన్ని మరింత కుంగ దీసింది.అదే..మహేశ్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణగారి మరణం. 2022 నవంబరు 15న కృష్ణగారు స్వర్గస్తులైయ్యారు. ఇలా వరుస దురదృష్టకర సంఘటనల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.
వరుస విషాదాల నుంచి కోలుకున్న మహేశ్ కొంత కోలుకుని, కొన్ని యాడ్షూట్స్ కంప్లీట్ చేసి సినిమానుకూడా ట్రాక్‌లో పెడదామనుకున్నాడు. అంతా ఒకే అయ్యింది. ముందు త్రివిక్రమ్ ఈ సినిమాకు కేజీఎఫ్ఫేమ్ అన్బుఅరివ్లను ఫిక్స్ చేశాడు. తొలి షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యాక్షన్ సీక్వెన్స్ మహేశ్కునచ్చలేదట. దాంతో షూటింగ్‌కు మళ్లీ బ్రేక్‌లు. ఫైట్మాస్టర్స్గా రామ్‌లక్ష్మణ్ వచ్చారు. కానీ కథే మొత్తం మారి పోయిందట. ముందు ఉన్న యాక్షన్ కథను కాదనుకుని, ఫ్యామిలీ కథకు వెళ్లారట మహేశ్, త్రివిక్రమ్.
అంతా సవ్వంగానే సజావుగానే సాగుతుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎస్ఎస్ఎమ్బీ సినిమానుఆగస్టులో(అది ఆగస్టు 11న అని ఊహిం వచ్చు) రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లుగా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ (తమిళ హిట్ ‘వీరమ్’కుతెలుగు రీమేక్) ఏప్రిల్ నుంచి ఆగస్టు 11కి వాయిదా పడింది. దీంతో మహేశ్‌బాబు తన సినిమాను సంక్రాంతి బరిలో దించాడు. 2024 జనవరి 13న సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు మహేశ్‌బాబు.
Prabhas: ప్రభాస్‌కు సంక్రాంతి కలిసి రానట్లేనా?
13.01.2024!! #SaveTheDate https://t.co/hrAkrNRR2k
— Mahesh Babu (@urstrulyMahesh) March 26, 2023
టైటిల్‌పై సందిగ్ధం!
మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లోని ఈ థర్డ్ ఫిల్మ్‌కు ఇప్పటివరకూ ‘అయోధ్యలో అర్జునుడు’, ‘అమె కథ’ ‘అమ్మ కథ’, ‘అమరావతికి అటు ఇటు’, ‘గుంటూరు మిర్చి’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్‌గా త్రివిక్రమ్ మదిలో ఉన్న టైటిల్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.
మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లోని ఈ సినిమాలో పూజాహేగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.మలయాళ నటుడు జయరామ్ కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రాత్రివేళ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.