Kanguva Vs Vettaiyan: దసరాకు తమిళ బాక్సాఫీస్ వద్ద పోటీ పెరుగుతోంది. రజనీకాంత్ పోలీసాఫీసర్‌గా నటించిన ‘వేట్టయాన్’ సినిమా అక్టోబరు 10న విడుదల కానుంది. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకుడు. అమి తాబ్ బచ్చన్, రానా, ఫాహద్‌ఫాజిల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 10న విడుదల కానుంది. ఫేక్ ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది (Kanguva Vs Vettaiyan).
Kalki2898adReview: ప్రభాస్ కల్కి2898ఏడీ రివ్యూ
తాజాగా సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువ’ సినిమాను దసరా సందర్భంగా అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో యోగిబాబు ఓ కీలక పాత్రలో, విలన్‌గా బాబీ డియల్, హీరోయిన్గా దిశా పటానీ నటించారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేజీ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. 18వ శతాబ్దంలో అంతుచిక్కని వ్యాధితో చనిపోయిన ఓ యుద్ధవీరుడు పునర్జన్మ నేపథ్యంలో ‘కంగువ’ సినమా కథనం ఉంటుందని తెలుస్తోంది.
ఇదే రోజు మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న 360వ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. హిందీలో ఆలియాభట్ ‘జిగ్రా’, షాహిద్‌కపూర్ ‘దేవా’, రాజ్కుమార్రావ్ల ‘విక్కీవిద్యాకీఓవాలా వీడియో’, వంటి సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అయితే తెలుగులో దసరా రిలీజ్‌కు ఇంకా ఏ సినిమా ఖరారు కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ దసరాకు విడుదల కావాల్సింది. కానీ ‘దేవర’ సినిమాను సెప్టెంబరు 27కి వాయిదా వేశారు.