Maheshbabu: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఎప్పుడు హాలీడేకి వెళ్లిన ఆల్మోస్ట్ ఫ్యామిలీతో వెళ్తుంటారు. రీసెంట్గా న్యూ ఇయర్ 2024 సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లొచ్చారు మహేశ్‌బాబు. అయితే మహేశ్ సోలోగా జర్మనీ వెళ్లారన్నది టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. అంతేకాదు…తాను హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌పై రాజమౌళి ఎప్పట్నుంచో వర్క్ చేస్తున్నారు.
Maheshbabu GunturKaaram Review: గుంటూరుకారం రివ్యూ
కాగా ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ సినిమా లోని మహేశ్ మేకోవర్ కొత్తగా ఉంటుందట. ఈ మేకోవర్‌కు చెందిన సాంకేతికపరమైన విషయాల చర్చల
కోసమో మహేశ్ జర్మనీ వెళ్లారని టాలీవుడ్ టాక్. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీత దర్శకులు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ యాక్టర్స్ ఈ సినిమాలో భాగమైయ్యేలా ఫారిన్ యాక్టింగ్ ఏజెన్సీలతో రాజమౌళి ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.