HanuMan: ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హను–మాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలో…సంక్రాంతికి విడుదలై, బయ్యర్స్‌కు అత్యథిక లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా ‘హను–మాన్’ చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. తేజా సజ్జా హీరోగా నటిం చిన ఈ సినిమాకు ప్రశాంత్‌వర్మ దర్శకుడు. కె. నిరంజన్‌రెడ్డి నిర్మించారు. అయితే ‘హను – మాన్’ సినిమాలో సముద్రఖనిది ఓ కీలక పాత్ర. ఈ సినిమా రోల్ కోసం అనుపమ్‌ఖేర్, నానా పటేకర్ పేర్లను కూడా పరిశీలించారు మేకర్స్. అయితే ఈ పాత్రను కన్నడ ‘కాంతార’ ఫేమ్ రిషబ్‌శెట్టిని చేయవలసినదిగా కోరారట ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్‌వర్మ. కానీ ఆ సమయంలో ‘కాంతార’ సినిమాతో రిషబ్‌శెట్టి బిజీగా ఉండటం వల్ల ‘హను–మాన్’ సినిమాకు సున్ని తంగా నో చెప్పారట. అయితే ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనీవర్సిటీలో రూపొందే ఓ సినిమాలో భాగం అవుతానని మాత్రం రిషబ్‌శెట్టి చెప్పారట. మరి..‘జై హనుమాన్’ సినిమాలో ఏమైనా రిషబ్‌శెట్టి నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
HanuMan: హను–మాన్కు నో చెప్పిన హీరో ఎవరో తెలుసా!
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హను–మాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలో...సంక్రాంతికి విడుదలై, బయ్యర్స్‌కు అత్యథిక లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా ‘హను–మాన్’ చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
1 Comment
1 Comment
-
Pingback: HanuMan Boxoffice: హను–మాన్ రికార్డ్స్..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! | tollywoodhub