HanuMan Boxoffice: ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హను–మాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ సినిమా విడుదలై ఇంకా ఇరవై రోజులు పూర్తి కాకుండానే..చాలా బాక్సాఫీస్ రికార్డ్స్ ఈ సినిమా సొంతం అయ్యాయి. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. వరలక్ష్మీశరత్‌కుమార్, వినయ్‌రాయ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా జనవరి 12న థియేటర్స్‌లో విడుదలైంది.
- థియేట్రికల్ బిజినెస్‌లో వందకోట్ల రూపాయలకు పైగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల జాబితాలో ‘హనుమాన్’ చేరింది. ‘హనుమాన్’ కంటే ముందు ప్రభాస్– రాజమౌళిల ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ ఎన్టీఆర్–రామ్‌చరణ్–రాజమౌళిల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు ఉన్నాయి.
- తెలుగు చిత్రం హిందీ డబ్బింగ్ కాబడి అక్కడి థియేటర్స్‌లో ఎక్కువ కలెక్ట్ చేసిన టాప్ టెన్ తెలుగు సినిమాల్లో హనుమాన్ చేరింది. ప్రభాస్ ‘బాహుబలి 2’– 512, ఎన్టీఆర్–రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్– 277’, ప్రభాస్ ‘సలార్’–153, ‘సాహో’–147, ప్రభాస్ ‘బాహుబలి’ –119, అల్లు అర్జున్ ‘పుష్ప : ది రైజ్’ – 108, తేజా సజ్జా ‘హనుమాన్’ – 50 కోట్లు (ఇంకా ప్రదర్శించబడుతోంది), నిఖిల్ ‘కార్తీకేయ 2’– 34 కోట్లు, ప్రభాస్ ‘రాధేశ్యామ్’– 22.5 కోట్లు, విజయ్‌దేవరకొండ ‘లైగర్’– 21.2 కోట్లుగా ఉన్నాయి.(HanuMan Boxoffice)
- ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోల తర్వాత …250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన తెలుగు హీరో తేజా సజ్జా. ఇది ‘హను–మాన్’తోనే సాధ్యమైంది
- వందకోట్ల రూపాయల షేర్‌ను కలెక్ట్ చేసిన హీరోలు చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, యశ్. ఇప్పుడు ‘హను–మాన్’తో తేజా సజ్జా ఈ ఫీట్‌ను సాధించాడు.
- ఓవర్సీస్ మార్కెట్లో యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన ఓ చిత్రంగా ‘హను–మాన్’ ఓ రికార్డు సృష్టించింది. ఈ లిస్ట్‌లో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్, సాహో, ఆర్ఆర్ఆర్, సలార్ చిత్రాలు ఉన్నాయి.
- నార్త్ అమెరికాలో 5మిలియన్ డాలర్ల కలæక్షన్స్ను సాధించిన చిత్రం ‘హను–మాన్’. అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో..(3.63), రామ్‌చరణ్ ‘రంగస్థలం’ (3.51), మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ (3.42), ప్రభాస్ ‘సాహో’(3.23), ప్రభాస్ ‘ఆదిపురుష్’(3.16), మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’(2.89), ‘గుంటూరుకారం’(2.61), చిరంజీవి ‘సైరా’(2.60), కీర్తీ సురేష్ ‘మహానటి’(2.54), అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’(2.47) సినిమాలను దాటి ‘హను–మాన్’ ఈ రికార్డును సాధించింది.
- ‘హనుమాన్’ కంటే ముందు… ప్రభాస్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’(20.76), ఎన్టీఆర్–రామ్‌చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’(14.83), ప్రభాస్ ‘సలార్: సీజ్ఫైర్’(8.92), ‘బాహుబలి:ది బిగినింగ్’(8.47) సినిమాలు ఉన్నాయి.
- ఆంధ్రా, నైజాం, సీడెడ్, ఓవర్సీస్, హిందీ…ఇలా ఈ విభాగాల్లో యాభైకోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన చిత్రంగానూ ‘హనుమాన్’ నిలిచింది.
- తొంభై ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతికి విడుదలై, అత్యథిక కలెక్షన్స్‌ను సాధిం చిన రికార్డు కూడా ‘హనుమాన్’ పేరిట లిఖించబడింది. ఈ సినిమా ఇంకా ప్రదర్శించబడుతోంది.
పై రికార్డులన్నీ సాధారణ టికెట్ ధరలతో, పెద్ద స్టార్కాస్ట్ లేకుండానే హను–మాన్ సాధించడం అనేది తెలుగు సినిమా చరిత్రలోనే పెద్ద అధ్యాయం. అదీ కూడా కేవలం 20 రోజులలోపు రన్‌తోనే. సినిమా ఇంకా ప్రదర్శించబడుతోంది. కాబట్టి…‘హను–మాన్’ సినిమా రికార్డ్స్ మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెపక్కర్లేదు.