Amy Jackson: రామ్చరణ్ ‘ఎవడు’, విక్రమ్ ‘ఐ’(తెలుగులో ‘మనోహరుడు’), రజనీకాంత్ ‘2.ఓ’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమీజాక్సన్ గుర్తుండే ఉంటారు. ఈ లండన్ బ్యూటీ రెండో వివాహానికి సిద్ధమైయ్యారు. బ్రిటిష్ వ్యాపారవేత్త ఆండ్రీస్తో దాదాపు నాలుగు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత 2019లో పెళ్లి చేసుకున్నారు అమీజాక్సన్. అదే ఏడాది సెప్టెంబరులో ఆండ్రీ, అమి ఓ బాబుకు జన్మనిచ్చారు. ఆ తర్వాత 2022లో అండ్రీ, అమీ విడిపోయారు.
ఆ తర్వాత ఇంగ్లీష్ యాక్టర్ ఎడ్ వెస్టిక్తో డేటింగ్ స్టార్ట్ చేశారు ఆమీ. తాజాగా 29 జనవరి, 2024న ఎడ్ వెస్ట్వక్తో ఆమీజాక్సన్ నిశ్చితార్థం జరిగింది. ఈ ఫోటోలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాలతో బిజీ అవుతున్నారు అమిజాక్సన్.