HanumanBoxoofice: బాక్సాఫీస్ వద్ద హను–మాన్ (HanuMan) సినిమా ర్యాంపేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2024 సంక్రాంతికి జనవరి 12న విడదులైన ‘హను–మాన్’ బాక్సాఫీస్ సరికొత్త లెక్కలను, రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది. ఇప్ప టికే 260 కోట్ల రూపాయలగ్రాస్ కలెక్షన్స్‌ను హను–మాన్ కొల్లగొట్టింది. తొంభై సంవత్సరాల చరిత్ర కలిగిన టాలీవుడ్లో ప్రతి సంక్రాంతి సీజన్‌కు ఎన్నో సినిమాలు విడుదలైయ్యాయి. అయితే ఈ సినిమాల కలెక్షన్స్ అన్నింటిని దాటుకుని ‘హను–మాన్’ సినిమా తెలుగు సినిమా సంక్రాంతి సూపర్‌స్టార్‌గా నిలిచింది.
సంక్రాంతి పండక్కి విడుదలై, అత్యథిక గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన రికార్డు ఇప్పటివరకు అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో…’ సినిమా పేరిట ఉంది. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 260 కోట్లరూపాయల గ్రాస్ కలెక్షన్స్‌తో ఇప్పటివరకు(హను–మాన్ రిలీజ్ ముందుకు వరకు) తొలిస్థానంలో ఉంది. రికార్డును ‘హను–మాన్’ అధికమించింది. సాధారణ టికెట్ థరలతో హను–మాన్ ఈ ఫీట్‌ను సాధించడం అనేది చిన్నవిషయం కాదు..అంతేనా..విడుదలైన 17 రోజులకే ‘అల..వైకుంఠపురములో..’ సినిమా లైఫ్‌టైమ్ గ్రాస్‌ను ‘హను–మాన్’ క్రాస్ చేయడం కూడా ఓ రికార్డే మరి. ఇక తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హను–మాన్’ సినిమా 2025లో విడుదల కానుంది.