Sukumar: ‘పుష్ప: ది రైజ్’ సినిమా రిలీజ్ విషయంలో సుకుమార్ చాలా ప్రెజర్ తీసుకున్నాడు. ‘పుష్ప: ది రైజ్’ సినిమా డిసెంబరు 2021, 17న విడుదలైంది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్‌లో సుకుమార్ పాల్గొనలేదు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా సుకుమార్ రాలేదు. ఆయన ప్లేస్‌లో కొరటాల శివ గెస్ట్‌గా వచ్చారు.
‘పుష్ప: ది రైజ్’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందు అంటే…డిసెంబరు 16న రాత్రి 8గంటల ప్రాంతంలో జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు మాత్రమే హజరైయ్యారు. మిగ తా ప్రమోషన్స్ అన్నీ ఈ చిత్రం హీరో అల్లు అర్జున్ అండ్ టీమ్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది.
చెప్పడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా…‘పుష్ప: ది రైజ్’ సినిమా విడుదల అయిన వెంటనే, ఈ సినిమా రెండోభాగం ‘పుష్ప: ది రూల్’ సినిమాను 2022 డిసెంబరులోనే విడుదల చేస్తామని, ఇందుకు తగ్గ పనులు మొదలైయ్యాయని ఈ చిత్రం నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు చెప్పారు. ఇది ‘పుష్ప: ది రైజ్’ సినిమా విడుదలైన తర్వాత జరిగిన ప్రెస్‌మీట్ ముచ్చట.
కానీ ‘పుష్ప: ది రూల్’ సినిమాను 2023 డిసెంబరులో విడుదల చేసే చాన్సెస్ ఉన్నాయని బన్నీ వాసు పరోక్షంగా వెల్లడించారు. కానీ ఇది సాధ్యపడలేదు. ఇప్పుడు ఆగస్టు 15, 2024న ‘పుష్ప: ది రూల్’ సినిమా రిలీజ్ అంటూ టీమ్ పదే పదే చెబుతున్నారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటివరకు యాభైశాతమే పూర్త యిందట. మరోసగభాగంచిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. అంటే…మిగిలిన 200 రోజుల్లో సుకుమార్ ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలి.
ఇక్కడ సమస్య ఉంది. ఏంటంటే….సుకుమార్ ఎడిట్రూమ్ డైరెక్టర్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు (నితిన్ ‘లై’ సినిమా ఆడియో ఫంక్షన్ చూడండి). అంటే…ఎక్కువ షూటింగ్ చేసి, ఎడిట్రూమ్లో సినిమాను సూపర్‌గా సెట్ చేయ డం. ఇలా చేయాలంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. అంటే కనీసం రెండు నెలలు అంటే..ఇప్పట్నుంచి రెండు నెలలు ముందే ‘పుష్ప: ది రూల్’ చిత్రీకరణ పూర్తవ్వాలి. ఇది సాధ్య మైయ్యేలా కనిపించడం లేదు. ఒకవేళ కుదిరినా…సుకుమార్‌కు ‘పుష్ప: ది రైజ్’ రిలీజ్ ముందు రోజులు గుర్తుకురాకతప్పదు. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ సినిమా చెప్పిన తేదీకి అంటే ఆగస్టు 15న థియేటర్స్‌లోకి రావాలంటే సుకుమార్ ఒత్తిడి గురి కాకతప్పదు. మరి..ఏం జరుగుతుందో చూడాలి.