Koratalasiva: డైరెక్టర్‌గా కొరటాల శివ కెరీర్ ‘ఆచార్య’కు ముందు, ‘ఆచార్య’ సినిమాకు తర్వాత అని చెప్పుకునేలా ఉంటుందని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. ‘ఆచార్య’ సినిమా సంబంధించిన బిజినెస్ వ్యహహార్యాల్లో చురుకుగా జోక్యం చేసుకున్నారు కొరటాల శివ. ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్. కొరటాల శివ స్థిరాస్తులను అమ్ముకోవాల్సివచ్చింది. ఆయన తర్వాతి చిత్రం ‘దేవర’ షూటింగ్ పనులు కూడా కాస్త ఆలస్యంగా మొదలు కావాల్సి వచ్చింది. అయితే కొరటాల శివ డైరెక్టర్ని ‘దేవర’ సినిమా రెండుభాగాలుగా విడుదల కానుంది. తొలిపార్టును ఏప్రిల్ 5న విడుదల చేద్దామనుకున్నారు కానీ వాయిదా పడింది. కొరటాల శివ కాస్త బాధపడ్డారు. ఈ బాధ నుంచి తేరుకోకముందే కొరటాల శివకు పాత తలనొప్పి మళ్లీ మొదలైంది.
అదే ‘శ్రీమంతుడు’ సినిమా ఇష్యూ. మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ సినిమా 2015లో సూపర్‌హిట్. అయితే ‘చచ్చెంతప్రేమ’ అనే తన కథను కాఫీ కొట్టి, కొరటాల శివ
‘శ్రీమంతుడు’ సినిమా తీశారని రచయిత శరత్చంద్ర ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన చట్టపరమైన పనులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోర్టు కొరటాలకు వ్యతిరేకంగా వచ్చింది. దీంతో కొరటాల శివ చిక్కుల్లో పడ్డారు. ఈ వివాదానికి సంబంధించిన తదనంతర పరిణామాలు ఏలా ఉంటాయో? అనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది.
ఈ ప్రభావం ఏమైనా ‘దేవర’ సినిమాపై కూడా పడుతుందా? అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి..ఏం జరుగుతుందో చూడాలి. అలాగే ‘ఆచార్య’ సినిమా విషయంలోనూ కొరటాల ఇలాంటి ఆరోపణలే ఎదురుకున్నారు. తన కథను కాపీ కొట్టి, కొన్నిమార్పులు చేసి కొరటాల ‘ఆచార్య’ సినిమా తీశారని అప్పట్లో ఓ రైటర్ ఆరోపించిన సంగతి గుర్తుండే ఉంటుంది.