Devara: సినీ ఇండస్ట్రీలో బోలెడు సెంటిమెంట్స్ ఉంటాయి. కొందరు న్యూమరాజలజీ ప్రకారం పేరు మార్చు కుంటారు. కొందరు స్క్రీన్ నేమ్ మార్చుకుంటారు. మహేశ్‌బాబు తన సినిమా ఓపెనింగ్ ఫంక్షన్స్‌కు హాజరు కారు. ఇలా ఎవరి నమ్మకాలు, ఎవరి సెంటిమెంట్స్ వారికి ఉంటాయి. ఈ కోవలోనే ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఏంటంటే…రాజమౌళితో సినిమా చేసిన హీరో తర్వాతి సినిమా ఫ్లాప్ అని. జరిగిన సంఘటనలు కూడ ఇది నిజమెనేమో అని అనిపించేలా ఉన్నాయి. రాజమౌళితో ప్రభాస్ ‘ఛత్రపతి’ చేశారు. నెక్ట్స్ ఫిల్మ్ ‘పౌర్ణమి’ ఫట్. మళ్లీ ‘బాహుబలి’ చేశారు. ఆ నెక్ట్స్ ఫిల్మ్ ‘సాహో’ హిట్ కాలేదు. నితిన్ ‘సై’ తర్వాత వరుస ఫ్లాప్స్ చూశారు. రాజమౌళితో రామ్‌చరణ్ ‘మగధీర’ చేశారు. నెక్ట్స్ ఫిల్మ్ ‘ఆరేంజ్’ డిజాస్టర్. రీసెంట్గా ‘రౌద్రం..రణం..రుధిరం’(ఆర్ఆర్ఆర్)లో ఓ హీరోగా నటించారు రామ్‌చరణ్. ఈ సమయంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘వినయవిధేయరామ’ డిజాస్టర్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్ స్క్రీన్‌పై అంటే కీ రోల్లో కనిపించిన ‘ఆచార్య’ ఫట్. దీంతో ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో నటించిన మరో హీరో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాను గురించి ఈ చర్చ జరుగుతోంది.
Devara: దేవర రిలీజ్‌పై గందరగోళం…వాయిదా పడుతుందా?
‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కానీ రాజమౌళితో ఎన్టీఆర్ చేసిన తొలి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’. నెక్ట్స్ ఫిల్మ్ ‘సుబ్బు’ ఆడలేదు. 2003లో ‘సింహాద్రి’ బ్లాక్‌బస్టర్. నెక్ట్స్ ఫిల్మ్ ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్. 2007లో ‘యమదొంగ’ సూపర్‌హిట్. ఇమ్మిడియేట్ మూవీ ‘కంత్రి’ ఫ్లాప్. ఇలా..రాజమౌళితో హిట్ కొట్టి, ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ పరంగా ‘దేవర’కు కూడా బాక్సాఫీస్ గండం ఉంటుందని ఆయన ఫ్యాన్స్ కాస్త ఆందోళన పడుతున్నారు. పైగా ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న సినిమా ‘దేవర’ కావడం మరో మైనస్‌లా చూస్తున్నారట సినీ లవర్స్.